Devara Trailer : ‘దేవర’ ట్రైలర్ అప్డేట్.. దేవర & వర ఇద్దరూ వస్తున్నారు.. రేపు ట్రైలర్ రిలీజ్ ఎన్నింటికి అంటే..?
దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ట్రైలర్ టైం రివీల్ చేసారు.
- Saketh U
- Updated on- September 9, 2024 / 02:22 PM IST
Devara Trailer Update Release Time Revealed NTR Coming with Duel Role
Devara Trailer : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Also Read : Sudher Babu : ‘మా నాన్న సూపర్ హీరో’.. క్లాస్ లుక్ లో స్కూటర్ పై సుధీర్ బాబు..
తాజాగా ట్రైలర్ టైం రివీల్ చేసారు. రేపు సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ అప్డేట్ ఇస్తూ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు. ఒక ఎన్టీఆర్ ముందుకు చూస్తుంటే మరో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి ఉన్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాను నుండి రక్తం కారుతోంది. అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతాలు దేవర, వర రాబోతున్నారు అని రాసుకొచ్చింది మూవీ యూనిట్.
దీంతో దేవర సినిమాలో ఎన్టీఆర్ దేవర, వర అనే రెండు రోల్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ కూడా వైలెన్స్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. రేపు దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరగనుంది.
