Devi Sri Prasad emotional comments about Yellamma movie.
Yellamma: టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయన మ్యూజిక్ ఎంత ఎనర్జీగా ఉంటుంది ఆయన అంతకన్నా ఎనర్జీగా ఉంటారు. మైక్ పట్టుకొని స్టేజి ఎక్కాడు అంటే అంతే జనాలందరూ ఉర్రూతలుగాల్సిందే. అంతలా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పుడు ఈ మ్యూజిక్ సెన్సేషన్ హీరోగా మారుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా ఎల్లమ్మ.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను బలగం వేణు తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వచ్చింది. టైటిల్ టీజర్, అందులో దేవి శ్రీ ప్రసాద్ లుక్స్ కి ఆడియన్స్ షాక్ అయ్యారు. సరికొత్త అవతారంలో దేవి శ్రీ ప్రసాద్ జనాలను అవాక్కయ్యేలా చేశాడు. ఆ ఒక్క వీడియో సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ వీడియో విడుదలనప్పటి నుంచి సినిమా ఎప్పుడప్పుడు విడుదల అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎల్లమ్మ(Yellamma) సినిమా గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. “ఎల్లమ్మ సినిమా అనేది నన్ను, నా సంగీతాన్నీ ప్రేమంచే ప్రతీ ఒక్కరికి నా బహుమతి. అందులో నేను చేస్తున్నందుకు కాదు. ఎల్లమ్మ కథనే సంగీతంలో ముడిపడి ఉంది కాబట్టి” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
దీంతో, దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మాములు సినిమాలకే ఒక రేంజ్ మ్యూజిక్ అందించే దేవి కథలోనే సంగీతాన్ని ఇముడ్చుకున్న ఎల్లమ్మ లాంటి సినిమాకు ఏ రేంజ్ మ్యూజిక్ అందిస్తాడు అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దేవి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఎల్లమ్మ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.