Yellamma : దేవిశ్రీప్రసాద్ బర్త్‌డే.. ఎల్లమ్మ ఫస్ట్‌లుక్ రిలీజ్..
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న చిత్రం ఎల్లమ్మ (Yellamma ).
- Thota Vamshi Kumar
- Published on- August 2, 2026 / 05:15 PM IST
Devi Sri prasad new look in Yellamma movie
Yellamma : ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న చిత్రం ఎల్లమ్మ. బలగం ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha : ఏ కాలమూ ఒకేలా ఉండదు.. సమంత లేటెస్టు ఫోటోలు వైరల్..
కాగా.. నేడు దేవిశ్రీప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. చేతిలో కిరీటం పట్టుకుని రెట్రో లుక్‌లో దేవిశ్రీ కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్‌తో దేవి చాలా అందంగా ఉన్నాడు. ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ పర్సిగా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో కథానాయిక ఎవరు ? మిగిలిన నటీనటులు ఎవరు అన్నది ఇంకా చిత్ర బృందం వెల్లడించలేదు.
The birth of an actor…
On the day of his birth ❤️🔥A name called PARSHI.
A world called #Yellamma.
A journey we are all waiting to witness 🔥#HBDDeviSriPrasad #SVC61 Rockstar @thisisdsp @VenuYeldandi9 #DilRaju #Shirish @muraligdop @Hr_3555 #HanshithaReddy @svc_official… pic.twitter.com/9yo6QzBN8X— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026
