Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 8 ఏళ్ళ క్రితమే సినిమా అనుకున్నారు.. ఆ సినిమా, డైరెక్టర్ గురించి తెలుసా?
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాతో రాబోతున్నాడు. (Devi Sri Prasad)
- Saketh U
- Published On : February 21, 2026 / 11:47 AM IST
Devi Sri Prasad
Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరికి తెలిసిందే. చిన్నప్పటినుంచే మ్యూజిక్ డైరెక్టర్ గా మారి తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అనేక సినిమాలతో మెప్పించాడు. ఇప్పుడున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికంటే ముందే దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో టాలీవుడ్ ని ఏలాడు. ఇన్నేళ్ల మ్యూజిక్ కెరీర్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.(Devi Sri Prasad)
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాతో రాబోతున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడో 8 ఏళ్ళ క్రితమే హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఈ విషయం తెలిపాడు.
Also Read : Rashmika Mandanna : విజయ్ ని పెళ్లి చేసుకునే టైంలో.. రష్మిక పాత రిలేషన్ గురించి మాట్లాడిన నటుడు..
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. సుకుమార్ నన్ను హీరోగా పరిచయం చేయాలి అనుకున్నారు. ఒక కథ కూడా అనుకున్నాము. కానీ ఆ సమయంలో మా నాన్న చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. త్రివిక్రమ్, హరీష్ శంకర్, దిల్ రాజు కూడా గతంలో నన్ను హీరోగా చేయమని ప్రోత్సహించారు అని తెలిపారు.
దేవిశ్రీ ప్రసాద్ తండ్రి రైటర్ సత్యమూర్తి 2015 లో మరణించారు. ఆ సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా అనుకున్నారట సుకుమార్. కానీ తండ్రి చనిపోవడంతో ఆ ఆలోచనని దేవి విరమించారు. గతంలో దేవిశ్రీ ప్రసాద్ శంకర్ దాదా, జులై, అత్తారింటికి దారేది, ఖైదీ నెం 150.. ఇలా అనేక సినిమాల్లో సాంగ్స్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.
Also Read : Lavanya Tripathi : సెకండ్ ప్రగ్నెన్సీ పై మెగా కోడలు కామెంట్స్ వైరల్..
ఇప్పుడు ఎల్లమ్మకి కూడా నెలకు పది రోజులు మాత్రమే షూటింగ్ కి డేట్స్ ఇస్తూ మిగిలిన రోజులు తన మ్యూజిక్ చేసుకునేలా దిల్ రాజు ఒప్పించారట. అందుకే ఈ సినిమాని దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకున్నారని తెలిపారు. మరి ఇన్నాళ్లు మ్యూజిక్ తో మెప్పించిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు నటుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.
