Pushpa 2 : పుష్ప 2 మొదటి పాట రాబోతోందా.. ఈసారి ప్రమోషన్స్‌లో తగ్గేదేలే..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ రెడీ చేస్తున్న పుష్ప 2 మూవీ టీం. సినిమా నుంచి మొదటి పాటని..

Devisri Prasad is ready to release first song from Allu Arjun pushpa 2

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టీజర్ అండ్ పోస్టర్ తప్ప మరో కొత్త అప్డేట్ రాలేదు. ఆగష్టులో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయినా వస్తే బాగుండని ఫ్యాన్స్ అంతా ఆశ పడుతున్నారు. తాజాగా మూవీ టీం కూడా ఆ క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి సిద్దమయ్యినట్లు సమాచారం.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది బర్త్ డేకి టీజర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిన మూవీ టీం.. ఈసారి సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట. పుష్ప 1కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సెకండ్ పార్ట్ మ్యూజిక్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ కూడా అందుకు తగ్గట్లు మ్యూజిక్ ట్రాక్స్ ని సిద్ధం చేసినట్లు సమాచారం.

Also read : Singer Mangli : సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన డీసీఎం..

మరి ఈసారి బర్త్ డే గిఫ్టుగా సాంగ్ నే రిలీజ్ చేస్తారా..? లేదా ఇంకేమైనా క్రేజీ అప్డేట్ తో వస్తారా..? అన్నది చూడాలి. కాగా పుష్ప 1 మూవీ సమయంలో టైం లేక ప్రమోషన్స్ ని పెద్దగా నిర్వహించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రమోషన్స్‌లో తగ్గేదేలే అన్నట్లు ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి తన సినిమాలు కోసం చేసే ప్రమోషన్స్ రేంజ్ లోనే పుష్ప 2 ప్రమోషన్స్ ని కూడా నిర్వహించనున్నారనే సమాచారం.

కాగా పుష్ప 2కి ప్రస్తుతం బాహుబలి 2 రేంజ్ లో హైప్ నెలకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి పోటీ లేకుంటే.. బాహుబలి రికార్డులను అందుకునే అవకాశం ఉంది. కానీ పుష్ప 2 రిలీజ్ సమయంలోనే నార్త్ టు సౌత్ పలువురి బడా హీరోల సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ‘గోట్’, రజినీకాంత్ ‘వెట్టై’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, అజయ్‌ దేవగన్, రణ్‌వీర్ సింగ్ ‘సింగం 3’ రిలీజ్ లు కూడా పుష్ప 2తోనే ఉండబోతున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు