Singer Mangli : సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన డీసీఎం..

సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం. మంగ్లీ కారును డీసీఎం ఢీకొట్టిన ప్రమాద విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Singer Mangli : సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన డీసీఎం..

Tollywood Singer Mangli met an road accident news gone viral

Updated On : March 18, 2024 / 9:36 AM IST

Singer Mangli : టాలీవుడ్ సింగర్ మంగ్లీకి ప్రమాదం జరిగిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారుని కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం గత శనివారం (మార్చి 16) అర్ధరాత్రి జరిగింది. హైదరాబాద్-బెంగళూరు హైవే పై తొండుపల్లి వంతెన వద్ద ఈ ఘటన జరిగింది.

అసలు ఏమైందంటే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో జరుగుతున ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. అక్కడ కార్యక్రమం అనంతరం శనివారం రాత్రి హైదరాబాద్‌-బెంగళూర్‌ హైవే మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషాబాద్‌ మండలంలోని తొండుపల్లి వంతెన వద్దకు చేరుకున్న సమయానికి.. కర్ణాటకకు చెందిన ఒక డీసీఎం వేగంగా వచ్చి మంగ్లీ కారుని వెనుక నుంచి ఢీ కొట్టింది.

Also read : RCB Womens : ఆర్సీబీ ఉమెన్స్ టీం విన్.. మెన్స్ టీంపై సోషల్ మీడియా ట్రోల్స్..

డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు శంషాబాద్‌ పోలీసులు తెలియజేసారు. ఇక ఈ ప్రమాదం జరిగినప్పుడు మంగ్లీతో పాటు కారులో డ్రైవర్ మేగరాజు, మనోహర్ కూడా ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కేవలం కారు మాత్రం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన అనంతరం.. మంగ్లీ అదే కారులో ఇంటికి క్షేమంగా చేరుకున్నారు.

Tollywood Singer Mangli met an road accident news gone viral