Dhanush50 : ధనుష్ మైల్ స్టోన్ మూవీ అనౌన్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా తన మైల్ స్టోన్ మూవీని ప్రకటించాడు. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది.
- gum 95921
- Published On : January 20, 2023 / 11:14 AM IST
Dhanush50
Dhanush50 : తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో రెండు చిత్రాలు తెలుగు దర్శకులతో కావడం గమనార్హం. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే బై లింగువల్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నాడు.
Dhanush : ధనుష్ మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పాడా??
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా తన మైల్ స్టోన్ మూవీని ప్రకటించాడు. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలంలో వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తున్న సన్ పిక్చర్స్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నల్లని మేఘాలు, ఒక చోట నుంచి దట్టమైన పుగ రావడం కనిపిస్తుంది. ఈ పోస్టర్ తో పాటు డైరెక్టర్ ఎవరంటూ గెస్ చేయమని ట్వీట్ చేశారు నిర్మాతలు.
దీంతో ఈ సినిమాకి ధనుష్ కథని అందిస్తున్నాడు అని, తానే దర్శకుడిగా కూడా చేయవచ్చు అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి. మరి దీని పై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రావాల్సిందే. ఈ సినిమా షూటింగ్ కెప్టెన్ మిల్లర్ పూర్తి అవ్వగానే మొదలు కానుంది అని తెలుస్తుంది.
కాగా కెప్టెన్ మిల్లర్ సినిమా 19వ కాలం నాటి కథనంతో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు నటుడు సందీప్ కిషన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
#Dhanush50 announced by @sunpictures @dhanushkraja
Any guesses on who would be the Director?? pic.twitter.com/2E0vzFuybM
— SIIMA (@siima) January 18, 2023
