Dhanush : ధనుష్ మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పాడా??

ఇటీవల దిల్ రాజు తమిళ్, తెలుగు మిక్స్ చేసి భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ వారసుడు, శంకర్ చరణ్ సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడు అదే ఊపులో ధనుష్ తో కూడా సినిమా తీయడానికి కిషోర్ రెడ్డితో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్ని ఓకే అయితే.............

Dhanush : ధనుష్ మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పాడా??

Dhanush try to do another telugu movie

Dhanush :  కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ డబ్బింగ్ మూవీస్ తో టాలీవుడ్ జనానికి బాగానే ఫెమిలియర్ అయ్యాడు. ప్రెజెంట్ ‘సార్’ అనే మూవీతో అతడు తెలుగులో ఓ స్ట్రైట్ మూవీనే చేస్తున్నాడు. తెలుగు, తమిళ బైలింగ్విల్ మూవీగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందుతోంది ఆ సినిమా. తమిళ్ లో ‘వాతి’ పేరుతో రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోనూ ధనుష్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. త్వరలోనే సినిమా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి. దీంతో పాటు ధనుష్ మరో తెలుగు సినిమాకి కూడా కమిట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం.

శర్వానంద్ తో ‘శ్రీకారం’ సినిమా తీసిన డైరెక్టర్ కిశోర్ రెడ్డి డైరెక్షన్ లో ధనుష్ నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ‘శ్రీకారం’ సినిమాకి కంటెంట్ పరంగా మంచి అప్లాజ్ వచ్చినప్పటికీ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ కిశోర్ చెప్పిన మంచి కథకి బాగా ఇంప్రెస్ అయిన దిల్ రాజు ధనుష్ తో సినిమా తీసేందుకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి శ్రీకారం లాంటి సాఫ్ట్ సబ్జెక్ట్ కాకుండా ధనుష్ రేంజ్ కు తగ్గట్టుగానే కథాంశం ఉండబోతున్నట్టు టాక్.

ఇటీవల దిల్ రాజు తమిళ్, తెలుగు మిక్స్ చేసి భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ వారసుడు, శంకర్ చరణ్ సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడు అదే ఊపులో ధనుష్ తో కూడా సినిమా తీయడానికి కిషోర్ రెడ్డితో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్ని ఓకే అయితే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెుంట్ త్వరలోనే ఇస్తారట.

Samantha : ‘శాకుంతలం’లో చాలా కష్టంగా అనిపించింది..

ప్రజెంట్ ధనుష్ ‘సార్’ తో పాటు ‘కెప్టెన్ మిల్లర్’ అనే తమిళ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాకా, ధనుష్.. శేఖర్ కమ్ముల సినిమాకు ఫిఫ్ట్ కాబోతున్నాడు. అది కంప్లీట్ అయ్యాకనే కిశోర్ రెడ్డి సినిమాను స్టార్ట్ చేస్తాడని న్యూస్. మరి ఇంకెంత మంది తెలుగు డైరెక్టర్స్ ధనుష్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతారో చూడాలి.