Ram Charan- Dhanush: రామ్ చరణ్ చేయాల్సిన సినిమా.. ధనుష్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.. చరణ్ చేసుంటేనా?
Ram Charan Rejected Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసి ధనుష్(Charan- Dhanush) సూపర్ హిట్ అందుకున్నాడు.
- V Santhosh Kumar
- Updated on- May 2, 2026 / 06:11 PM IST
Dhanush scored a super hit with Ram Charan rejected story
- చరణ్ కాదన్న సినిమా ధనుష్ హిట్.
- రామ్ చరణ్ ఇమేజ్‌కు కథ సరిపడలేదు.
- లెక్చరర్ పాత్రలో ధనుష్ అద్భుత నటన.
Ram Charan- Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడంలో ఆయన దూరం. ప్రతీ సినిమాలో ఏది ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. అలా వచ్చిన సినిమాల్లో ఒకటి ‘సార్’. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టి మంచి ప్రశంసలు అందుకుంది ఈ సినిమా.
Anchor Rashmi: నేనేం మాట్లాడినా అదే తీసుకొస్తారు ఎందుకు.. మీరు తిట్టినా నేను ఊరుకోను!
అయితే, ఈ సినిమా కథను దర్శకుడు తొలుత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan- Dhanush)కు వినిపించాడట. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కథ రామ్ చరణ్ బాగా నచ్చిందట. కానీ, ఈ కథను తిరస్కరించడం వెనుక ఆయనకున్న మాస్ ఇమేజ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. సార్ సినిమా సందేశాత్మకమైనది, క్లాస్ టచ్ ఉన్న కథ కావడం వల్ల, తన బాడీ లాంగ్వేజ్‌కు ఇది సరిపోదని భావించి ఆయన ఈ సినిమాకు నో చెప్పి ఉండవచ్చునని నెటిజన్లు భావిస్తున్నారు.
మరోవైపు, ధనుష్ వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో దిట్ట. సార్ సినిమా పాత్రలో ఆయన ఒదిగిపోయి సినిమాను విజయతీరాలకు చేర్చారు. ఒక సాధారణ లెక్చరర్ పాత్రలో ధనుష్ చూపిన సహజ నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఒకవేళ రామ్ చరణ్ ఈ సినిమా చేసి ఉంటే, మెగా అభిమానులు ఆశించే స్థాయి యాక్షన్, ఎలివేషన్స్ ఉండకపోవచ్చని, అందుకే ధనుష్ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశారని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒకే కథ ఇద్దరు పెద్ద స్టార్ల మధ్య చర్చకు రావడం ఆసక్తికరం.
