ఘనంగా అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా వివాహం

కన్నడ ప్రిన్స్ ధృవ సర్జా తన చిన్ననాటి స్నేహితురాలు ప్రేరణను వివాహ మాడాడు.. ఈ కార్యక్రమం బెంగుళూరులో ఘనంగా జరిగింది..

  • Publish Date - November 25, 2019 / 06:50 AM IST

కన్నడ ప్రిన్స్ ధృవ సర్జా తన చిన్ననాటి స్నేహితురాలు ప్రేరణను వివాహ మాడాడు.. ఈ కార్యక్రమం బెంగుళూరులో ఘనంగా జరిగింది..

కన్నడ ప్రిన్స్ ధృవ సర్జా, ప్రేరణల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ధృవ స్వయానా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ మేనల్లుడు.. 2012లో కన్నడ నాట హీరోగా అడుగుపెట్టిన ధృవ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రేరణతో ఏడడుగులేశాడు. గతేడాది డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ధృవ, ప్రేరణ శంకర్‌‌ల వివాహ మహోత్సవం ఆదివారం బెంగళూరులో నిర్వహించారు.

ఇక్కడి జేపీ నగరలోని సంస్కృత బృందావనలోని కన్వెన్షన్‌ హాల్లో ఆదివారం ఉదయం ఉదయం 7.15 గంటల నుంచి 7.45 గంటల మధ్య వృశ్చిక లగ్నంలో ధృవ సర్జా, ప్రేరణలు దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. గౌడ సాంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగింది. వేడుకల్లో ధృవ సర్జా కుటుంబ సభ్యులతో పాటు ప్రేరణ కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమకు చెందిన వారు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా తన జీవిత భాగస్వామికి ధృవ రూ.21 లక్షల విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వడం విశేషం. ఉపేంద్ర, సుదీప్, యశ్, పునీత్‌ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌ కుమార్‌ దంపతులు హాజరై ధృవ, ప్రేరణలను ఆశీర్వదించారు.

ట్రెండింగ్ వార్తలు