Dhurandhar 2 OTT Date : జియో హాట్ స్టార్‌లో ధురంధ‌ర్ 2 స్ట్రీమింగ్‌.. ఏ రోజు నుంచంటే?

ధురంధ‌ర్ 2 చిత్రం స్ట్రీమింగ్ వివ‌రాల‌ను (Dhurandhar 2 OTT Date) జియోహాట్ స్టార్ వెల్ల‌డించింది

Dhurandhar 2 OTT streaming Date fix jio hot star

Dhurandhar 2 OTT Date : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న‌టించిన చిత్రం ‘ధురంధర్ 2’. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. 1800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ధురంధ‌ర్ మూవీ సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 19న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా వారికి జియో హాట్ స్టార్ శుభ‌వార్త అందించింది. ఈ చిత్రం జూన్ 4న రాత్రి 7 గంట‌ల నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది. మిగిలిన దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ చిత్రాన్ని వీక్షించ‌వ‌చ్చు. థియేట‌ర్ల‌లో ఈ చిత్ర ర‌న్‌టైమ్ 3 గంట‌ల 49 నిమిషాలు కాగా.. ఓటీటీ వ‌ర్ష‌న్ 3 గంట‌ల 52 నిమిషాలు.

Pujita Ponnada : తెలుగు అందం.. పూజిత పొన్నాడ ఫోటోలు వైర‌ల్..