Aditya Dhar : దురంధర్ డైరెక్టర్ తో ప్రభాస్.. అది కూడా మల్టీస్టారర్.. ఇంకో హీరో ఎవరో తెలుసా..?

ధురంధర్ 2 తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించిన ఈ దర్శకుడు తర్వాత ఓ పెద్ద ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నాడట. (Aditya Dhar)

  • Published On : April 6, 2026 / 09:48 PM IST

Aditya Dhar

Aditya Dhar : డైరెక్టర్ ఆదిత్య ధర్. ధురంధర్ 2 గ్రాండ్‌ సక్సెస్ తర్వాత ఈయన పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిపోయింది. ధురంధర్ 2 తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించిన ఈ దర్శకుడు తర్వాత ఓ పెద్ద ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నాడట.

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను కలిపి ఇండియన్ సినిమాని షేక్ చేసేలా మల్టీస్టారర్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. డైరెక్టర్ ఆదిత్యధర్ తీయబోయే ఈ సినిమాలో ప్రభాస్, సూర్య ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. ఇది ఒక హైవోల్టేజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని, ఇద్దరు హీరోలు బిగ్‌ స్టార్స్ కావడంతో సినిమాలో ఈక్వల్‌ ప్రయారిటీ ఉండేలా పవర్‌ఫుల్ రోల్స్‌ను క్రియేట్ చేస్తున్నారని బాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Also Read : Sudigali Sudheer : 14 ఏళ్ళ ప్రేమ.. వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.. సుడిగాలి సుధీర్ బ్రేకప్ స్టోరీ తెలుసా?

స్టోరీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఉండి, ఇంటర్నేషనల్‌ లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్, సూర్య కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ దగ్గర భారీ సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్, సూర్య నటనకు ఉన్న క్రేజ్ కలిసి సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. స్పెషల్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా రెండూ బ్యాలెన్స్‌గా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ గాసిప్ మాత్రం బాలీవుడ్ లో వినిపిస్తుంది. దీంతో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌లో సినిమాపై ఇప్పట్నుంచే హైప్‌ను పెంచుకుంటున్నారు.

Also Read : Niharika : టీవీ షోలో నిహారిక సీక్రెట్స్ బయటపెట్టిన తల్లి.. గర్ల్స్ కాలేజీలో జాయిన్ చేస్తే ఇంకేం చేసేదానివో..