Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ.. నిర్వాణ ఫంక్షన్‌లో విడివిడిగా అన్నదమ్ములు
మంచు ఫ్యామిలీ(Manchu Family)లో ఫంక్షన్ కి కలిసి రాని అన్నదమ్ములు.
- V Santhosh Kumar
- Published On : March 23, 2026 / 10:24 AM IST
Differences in manchu family
- మంచు లక్ష్మి కూతురు ఓణీ ఫంక్షన్
- కలిసి రాణి మంచు ఫ్యామిలీ
- మరోసారి బయటపడ్డ మంచు ఫ్యామిలీ విభేదాలు
Manchu Family: మంచు కుటుంబంలో విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు.. మంచు మనోజ్ మరోవైపు అన్నట్లుగా సాగుతున్న వీరి కుటుంబ వ్యవహారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. తాజాగా మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ ఓణీల వేడుక (హాఫ్ శారీ ఫంక్షన్) హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యం మంచు వారందరినీ ఒకే చోట చేరుస్తుందని అందరూ భావించారు, కానీ అక్కడ జరిగిన పరిణామాలు మాత్రం ఆశించినట్లుగా లేవు.
Renu Desai: నేనొక అంధ భక్తురాలిని.. ధురంధర్ 2 మూవీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్
ఈ వేడుకకు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి విచ్చేసి సందడి చేశారు. మేనకోడలిపై తనకున్న ప్రేమను చాటుకుంటూ మనోజ్ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. అయితే, విశేషం ఏమిటంటే.. మనోజ్ ఉన్న సమయంలో మోహన్ బాబు కానీ, మంచు విష్ణు కుటుంబం(Manchu Family) కానీ అక్కడ కనిపించలేదు. మనోజ్ వెళ్లిన తర్వాత లేదా వేరే సమయంలో మోహన్ బాబు, ఆయన భార్య నిర్మలా దేవి, అలాగే మంచు విష్ణు భార్య విరానికా తమ పిల్లలతో కలిసి వచ్చి నిర్వాణను ఆశీర్వదించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఒకే వేడుకకు వేర్వేరు సమయాల్లో రావడం, ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్త పడటం చూస్తుంటే వీరి మధ్య విభేదాలు ఇంకా తగ్గలేదని స్పష్టమవుతోంది.
గతంలోనే ఆస్తుల విషయంలోనూ, వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ మరియు విష్ణు మధ్య ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో పోలీసు ఫిర్యాదుల వరకు వెళ్లిన ఈ వివాదం, కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నా ఈ తాజా ఘటనతో మళ్ళీ తెరపైకి వచ్చింది. మంచు లక్ష్మి ఇద్దరు సోదరులను కలపాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదని ఈ ఓణీల వేడుక నిరూపించింది. అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ దూరం మంచు అభిమానులను కలవరపెడుతోంది.
