Dil Raju: ‘మెకానిక్’ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దిల్ రాజు
మణి సాయి తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్’కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన విలువైన సమయాన్ని కేటాయించి, తమ ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దిల్ రాజుకు చిత్ర దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.
- Anil Aaleti
- Published On : February 21, 2023 / 08:26 PM IST
Dil Raju Launches Mechanic Movie Motion Poster
Dil Raju: మణి సాయి తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్’కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన విలువైన సమయాన్ని కేటాయించి, తమ ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దిల్ రాజుకు చిత్ర దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.
టేనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా(ఎమ్.నాగ మునెయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ-నిర్మాతలుగా రూపొందుతున్న ‘మెకానిక్’ మూవీకి ‘ట్రబుల్ షూటర్’ అనే ట్యాగ్‌లైన్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక ఈ చిత్రం పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో తెరకెక్కగా.. వినోదానికి పెద్దపీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
మణి సాయి తేజ సరసన రేఖ నిరోషా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక ఈ సినిమాలో తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందిస్తున్నారు.
