Tollywood : రెండుగా చీలిన టాలీవుడ్.. ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టుకుంటున్న నిర్మాతలు..

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు రెండుగా చీలారా అంటే అవును అనే అంటున్నారు టాలీవుడ్ జనాలు. (Tollywood)

  • Updated on- May 13, 2026 / 08:59 PM IST

Tollywood Producers

Tollywood : తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు రెండుగా చీలారా అంటే అవును అనే అంటున్నారు టాలీవుడ్ జనాలు. గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్స్ లో పర్సెంటేజ్ విధానంలోనే సినిమాలు రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఇప్పుడున్న రెంటల్ విధానం ఆపేసి పర్సెంటేజ్ కావాలంటున్నారు. అయితే దీనిని నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. కానీ నిర్మాతల్లో కొంతమంది సింగిల్ స్క్రీన్స్ ని నడిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతలు వర్సెస్ నిర్మాతలు వార్ జరుగుతుంది ఈ థియేటర్స్ పర్సెంటేజ్ విధానం కోసం.

ఇటీవల తెలంగాణ థియేటర్స్ లో పర్సెంటేజ్ విధానంలో సినిమాలు రిలీజ్ చేయకపోతే థియేటర్స్ మూసేస్తాం, సినిమాలు మా థియేటర్స్ లో రిలీజ్ చెయ్యనివ్వం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఫిలిం ఛాంబర్ లో చర్చ జరుగుతుంది. త్వరలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మీటింగ్ జరగాల్సి ఉంది.

Also Read : Irumudi: అయ్యప్ప భక్తులకు పూనకాలే.. ఇరుముడి మూవీలో ‘విల్లాలి వీరుడు’ సాంగ్‌.. క్లారిటీ ఇచ్చిన జీవీ ప్రకాష్

కానీ ఇంతలోనే మే 12 మంగళవారం నాడు తెలంగాణలో కొన్ని థియేటర్స్ నడిపిస్తున్న నిర్మాత దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్, మరికొంతమంది తెలంగాణ ఎగ్జిబిటర్స్, ఏషియన్ సినిమాస్ నిర్మాత సునీల్ నారంగ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి పర్సెంటేజ్ ఇవ్వకపోతే సినిమాలు ఆపేస్తాం, థియేటర్స్ మూసేస్తాం, మా సమస్యలు ఇవి అంటూ గట్టిగానే ఫైర్ అయ్యారు. నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి సింగిల్ స్క్రీన్స్ ని దెబ్బ తీస్తున్నారు. మేము ఇకపై టికెట్ రేట్లు పెంచము. హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇచ్చి, బడ్జెట్స్ పెంచుకుంటున్నారు అంటూ టాలీవుడ్ నిర్మాతలపై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా ఈ నెల చివర్లోపు పర్సెంటేజ్ విధానానికి ఒప్పుకోకపోతే థియేటర్స్ మూసేస్తాము అంటూ బెదిరించారు.

దీంతో కేవలం సినిమాలు చేసే నిర్మాతలు, డిస్ట్రిబ్యూషన్ చేసే నిర్మాతలు నేడు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఫైర్ అయ్యారు. డైరెక్ట్ గానే ఏషియన్ సునీల్ నారంగ్ మీద.. నువ్వు మల్టిప్లెక్స్ లు కట్టుకుంటూ సింగిల్ స్క్రీన్స్ మీద మాట్లాడుతున్నావా, నువ్వు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయలేదా సినిమాల రిలీజ్ ల విషయంలో అంటూ ఫైర్ అయ్యారు.

ఇక దిల్ రాజు పై అయితే.. హరిహర వీరమల్లు విడుదల సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది. ఈ మధ్యలో వచ్చిన ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు రిలీజ్ చేసారు. మీరు వార్2, కూలి, ఓజి, మన శంకర వరప్రసాద్ రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్స్ కష్టాలు కనపడలేదా? ఇప్పుడు మీ చేతిలో పెద్ద సినిమా లేదని బ్లాక్ మెయిల్ చెయ్యడం కరెక్ట్ కాదు. సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు రిలీజ్ చేసారు కదా, అప్పుడు ఎందుకు ఈ సమస్యను తీసుకురాలేదు. మీ సినిమా అయితే బాగుండాలి. మా సినిమా కాబట్టి ఇలా చేస్తారా? మా సినిమాల్లో కూడా మీకు డబ్బులు కావాలా? పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. 20 సంవత్సరాల నుంచి తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎగ్జిబిటర్లకు న్యాయం చేయలేనిది ఈరోజు గుర్తుకొచ్చిందా? మొన్న సంక్రాంతి సినిమాలకు కూడా టికెట్ రేట్లు తెచ్చుకున్నారు కదా? మళ్ళీ ఇప్పుడు టికెట్ రేట్లు తెచ్చుకున్నా పెంచము అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. మీరొక్కరే సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా? వేరేవాళ్లు ఎదగకూడదా అంటూ ఫైర్ అయ్యారు.

Also Read : Tollywood Producers : ఏషియన్ సునీల్ నారంగ్ పై నిర్మాతల ఫైర్.. అసలు మీకేం తెలుసు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..

ఇలా టాలీవుడ్ లోని నిర్మాతలే రెండుగా చీలి ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, ఒకరి తప్పులను ఇంకొకరు వేలెత్తి చూపించడంతో ఈ సమస్య చర్చగా మారింది. టాలీవుడ్ జనాలంతా ఇలా ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్న నిర్మాతలని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి టాలీవుడ్ పెద్దలు దిగి ఈ సమస్యని పరిష్కారం చేస్తారా? లేక ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఎంటర్ అవుతారా? ప్రభుత్వమే ఈ సమస్యలోకి దిగి పరిష్కారం ఇస్తుందా చూడాలి. కానీ ఒక పరిశ్రమలో ఉండే నిర్మాతలే ఇలా చీలి మీరలా మీరిలా అని కొట్టుకోవడంతో బయటి పరిశ్రమల వాళ్లకు, బయట జనాలకు నెగటివ్ అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. వారి ముందు చులకన అయ్యే అవకాశం ఉంది.