Balagam : థియేటర్లో ‘బలగం’ బలం ఏమాత్రం తగ్గేదేలే..
చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన బలగం ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఓటిటికి కూడా వచ్చేసిన ఈ సినిమా తాజాగా..
- gum 95921
- Updated on- April 21, 2023 / 06:30 PM IST
Dil Raju Priyadarshi Balagam movie completed 50days in theater
Balagam : జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాని నిర్మించింది. ఒక మనిషి చనిపోయిన తరువాత కుటుంబంలో చోటు చేసుకొనే విషయాలను కళ్ళకి కట్టినట్లు చూపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. టాలీవుడ్ లోనిప్రముఖులు సైతం ఈ సినిమా చూసి ఫిదా అవుతున్నారు.
Balagam : ఒకే ఫిలిం ఫెస్టివల్ లో 9 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన బలగం..
చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం ఓటిటి లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అయినా సరి థియేటర్లో బలగం బలం ఏమాత్రం తగ్గేదేలే అంటుంది. ఇక సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ప్రేక్షకుల అందరికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఫామిలీ ఆడియన్స్ లో ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తే ఇంకొన్ని రోజులు కూడా థియేటర్ లో సత్తా చాటే అవకాశం కనిపిస్తుంది.
Dil Raju Priyadarshi Balagam movie completed 50days in theater
కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్లు మాత్రమే కాదు అవార్డులు అందుకోవడంలో సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఇటీవల ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఇప్పటి వరకు 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను అందుకున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కి, అలాగే ఆస్కార్ కి కూడా బలగం చిత్రాన్ని పంపిస్తామని దిల్ రాజు తెలియజేశాడు.
