Family Star : ఫ్యామిలీ స్టార్ సినిమాలో డిలీటెడ్ సీన్ చూశారా? ఫ్లైట్‌లో అన్ని బ్రాండ్స్ మందు కలిపి విజయ్ ఏం చేసాడంటే..
ఓ పక్క థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా నడుస్తుంటే దిల్ రాజు తన యూట్యూబ్ ఛానల్ లో సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ ని విడుదల చేశారు.
- Saketh U
- Published On : April 12, 2024 / 05:27 PM IST
Dil Raju Released Vijay Deverakonda Deleted Scene From Family Star Movie in You tube
Family Star Deleted Scene : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల ఏప్రిల్ 5న థియేటర్స్ లో రిలీజయి సందడి చేస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. కొంతమంది ఈ సినిమా బాలేదని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా దిల్ రాజు రంగంలోకి దిగి ఫ్యామిలీ ఆడియన్స్ వద్ద డైరెక్ట్ రివ్యూలు తీసుకోవడంతో వాళ్లంతా సినిమా బాగుందని చెప్పారు.
ఇక ప్రతి సినిమాలోనూ షూటింగ్ చేసిన దాంట్లోంచి ఎడిటింగ్ లో లెంగ్త్ ఎక్కువైతే కొంచెం కట్ చేస్తారని తెలిసిందే. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ తీసేసారు. ఓ పక్క థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా నడుస్తుంటే దిల్ రాజు తన యూట్యూబ్ ఛానల్ లో సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ ని విడుదల చేశారు.
ఈ సీన్ లో.. విజయ్ అమెరికా వెళ్తుంటే ఫ్లైట్ లో ఉన్న బార్ లోకి వెళ్లి అక్కడ ఉన్న అన్ని బ్రాండ్స్ మందు కలిపి ఒక బాటిల్ లో పోయమంటాడు. ఫ్రెండ్స్ ఫ్లైట్ లో ఏమేం బ్రాండ్స్ ఉన్నాయో అడగమన్నారు అని చెప్తాడు. అలా కలిపినా మందులోంచి ఒక చుక్క తీసి గ్రాండ్ ఫాదర్స్ కి అని చెప్తాడు. ఈ ఫుల్ సీన్ సినిమాలో ఉంటే ఇంకొంచెం కామెడీ ఉండేది అని ఆడియన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ డిలీటెడ్ సీన్ ట్రెండ్ అవుతుంది. త్వరలో మరిన్ని డిలీటెడ్ సీన్స్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం.
