Bhaje Vaayu Vegam : హనుమంతుడి రిఫరెన్స్‌తో కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ టైటిల్ గ్లింప్స్ చూశారా.. హ్యాపీడేస్ హీరో రీ ఎంట్రీ..

తాజాగా కార్తికేయ నెక్స్ట్ సినిమాని, టైటిల్ ని ప్రకటించాడు. ఈ టైటిల్ గ్లింప్స్ ని మహేష్ బాబు రిలీజ్ చేశారు.

Bhaje Vaayu Vegam : హనుమంతుడి రిఫరెన్స్‌తో కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ టైటిల్ గ్లింప్స్ చూశారా.. హ్యాపీడేస్ హీరో రీ ఎంట్రీ..

Kartikeya next Movie Bhaje Vaayu Vegam Title Glimpse Released by Mahesh Babu

Updated On : April 12, 2024 / 5:08 PM IST

Bhaje Vaayu Vegam : RX100 ఫేమ్ కార్తికేయ(Kartikeya) కొత్త కొత్త కథలతో వస్తున్నాడు. విలన్ గా చేస్తూనే హీరోగా కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం బెదురులంక 2012 సినిమాతో వచ్చి మంచి విజయమే సాధించాడు. తాజాగా కార్తికేయ నెక్స్ట్ సినిమాని, టైటిల్ ని ప్రకటించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

నేడు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘భజే వాయు వేగం’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. హనుమంతుడి వేగం హీరోలో ఉంటుందని రిఫరెన్స్ తో ఈ టైటిల్ పెట్టినట్టు గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది. గ్లింప్స్ లో హీరో ఓ కార్ ని వాయు వేగంతో అన్నట్టు చాలా ఫాస్ట్ గా నడిపించినట్టు, వెనక డిక్కీ నుంచి డబ్బులు ఎగురుతున్నట్టు గ్రాఫికల్ గా చూపించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ టైటిల్ గ్లింప్స్ ని మహేష్ బాబు రిలీజ్ చేశారు.

Also Read : DeAr Review : ‘డియర్’ మూవీ రివ్యూ.. భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు..

ఇక ఈ సినిమాతో హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. హ్యాపీడేస్ సినిమాలో సీనియర్ ని ప్రేమించిన పాత్రలో నటించిన రాహుల్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ అవ్వలేదు. చివరిసారిగా 2017లో వెంకటాపురం అనే సినిమాలో కనిపించాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ భజే వాయు వేగం సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈ భజే వాయు వేగం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.