Dinesh Karthik : జవాన్ సినిమాపై దినేశ్ కార్తీక్.. 5 సంవత్సరాలు.. ఎన్నో డిస్కషన్లు, మరెన్నో..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సీనియర్ ఆటగాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ సినిమాని చూశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 9, 2023 / 04:58 PM IST
Dinesh Karthik on Jawan
Dinesh Karthik on Jawan : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ తనకు ఏదీ అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు. తాజాగా ఈ సీనియర్ ఆటగాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ సినిమాని చూశాడు. అనంతరం ఈ చిత్రం గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
జవాన్ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని దినేశ్ కార్తీక్ చెప్పాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ విభిన్న గెటప్‌లలో చూపించడానికి అట్లీ పడ్డ కష్టం కనిపించిందని తెలిపాడు. తనకు విక్రమ్ రాథోడ్ స్టైల్ బాగా నచ్చిందని, షారుఖ్ ఖాన్‌లో అటువంటి చరిష్మా మునుపు ఎన్నడూ చూడలేదన్నాడు. ‘2018లో నేను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ప్రయాణాన్ని ప్రారంభించాను. ఆ సమయంలోనే దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ తో ఈ సినిమా గురించి చర్చలు ప్రారంభినట్లు నాకు గుర్తుకు ఉంది. అప్పుడు అట్లీ.. చెన్నై, కోల్‌కతా మ్యాచ్ చూసేందుకు వచ్చాడు.’ అని కార్తీక్ తెలిపాడు.
Rakul Preet Singh : ఖరీదైన కారుని కొనుగోలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..
ఇంకా.. ‘5 సంవత్సరాలు పట్టింది. చాలా చర్చలు, చిన్న చిన్న స్క్రిప్ట్ మార్పులు, మొత్తంగా.. ప్రతీ ప్రేమ్‌ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక నయనతార, విజయ్‌సేతుపతిలు పాన్ ఇండియా స్టార్లు. ప్రతీ సన్నివేశంలో మీ నటన కట్టిపడేసింది. మిమ్మల్ని ఇలా చూడడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది. మీరు ప్రతి సినిమాకి విభిన్న సంగీతాన్ని అందిస్తూ చాలా ఎత్తుకు ఎదుగుతున్నారు.’ అంటూ దినేశ్ కార్తీక్ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశాడు.
Mumbai : షారుఖ్ ఖాన్ పోలికలతో ఉన్న ఇతనెవరో తెలుసా?
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ చిత్రంలో నయనతార(Nayanathara) హీరోయిన్గా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే మరికొంతమంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.129 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
