×
Ad

Anil Ravipudi: విలన్ గా అనిల్ రావిపూడి.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న దర్శకుడు

వెండితెర ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి(Anil Ravipudi).

Director Anil Ravipudi said he wants to play a villain role.

  • విలన్ చేయాలని ఉందని చెప్పిన అనిల్ రావిపూడి
  • దానికి ఇంకా టైం ఉందన్న దర్శకుడు
  • అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్

Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అనిల్ రావిపూడి అనే చెప్పాలి. ఆయన తీసిన 9 సినిమాల్లో అన్ని బ్లాక్ బస్టర్స్ అవడం విశేషం. ఇక రీసెంట్ గా వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

దీంతో, ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో సినిమాలు చేసేందుకు అటు నిర్మాతలు, ఇటు హీరోలు క్యూ కడుతున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఆసక్తికర న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, దర్శకుడిగా అనిల్ రావిపూడి సూపర్ సక్సెస్ అలాగే, ఆయనకు నటన మీద కూడా మంచి ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. తన సినిమాల షూటింగ్ సమయంలో కూడా చాలా సీన్స్ ని ఆయన నటించి చూపించడం మనం చూస్తూనే ఉంటాం.

Payal Radhakrishna: పాయల్ పరువాల వల.. నెట్టింట హాట్ ఫొటోలు వైరల్

ఆలా ఆయన తెరపై కనిపించడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారట. ఇదే విషయం గురించి అనిల్ రావిపూడి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన తన వెండితెర ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నాకు నటన అంటే చాలా ఇష్టం. అది అందరికి తెలుసు. కానీ, హీరోగా మాత్రం చేయలేను. నాకు మంచి విలన్ రోల్ చేయాలని ఉంది. ఎవరైనా నెగిటీవ్ రోల్ కోసం వస్తే తప్పకుండా చేస్తా. కానీ, ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా టైం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.

దీంతో అనిల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో మరోసారి జతకట్టనున్నాడు. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్. మార్చ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.