Jawan Movie : జవాన్ సినిమాని ఆస్కార్‌కి తీసుకెళతాం.. షారుఖ్ సర్‌తో నేను మాట్లాడతాను.. అట్లీపై ట్రోల్స్..

తాజాగా అట్లీ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Director Atlee Wants to send Jawan Movie to Oscar Race Atlee Comments goes viral

Jawan Movie :  బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. తమిళ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్లకు దూసుకెళ్తుంది. పఠాన్ తర్వాత జవాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ సాధించడంతో షారుఖ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

జవాన్ పెద్ద సక్సెస్ అవ్వడంతో చిత్రయూనిట్ కి సంబంధించిన వాళ్లంతా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా అట్లీ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో జవాన్ సినిమాకి అవార్డ్స్ వస్తాయా, ఆస్కార్(Oscar) రేంజ్ కి తీసుకెళ్తారా అని అడగ్గా అట్లీ మాట్లాడుతూ.. కచ్చితంగా అనుకున్నవి అన్ని జరిగితే జవాన్ ఆస్కార్స్ కి వెళ్తుంది. ప్రతి డైరెక్టర్, ప్రతి సినిమా, సినిమాకు సంబంధించిన వాళ్లంతా వాళ్ళ సినిమాలకు అవార్డులు రావాలని కోరుకుంటారు. ఆస్కార్స్, గోల్డెన్ గ్లోబ్, నేషనల్ అవార్డ్స్.. ఇలా ప్రతిషాత్మకమైన అవార్డులు తమ సినిమాలకి రావాలనుకుంటారు. నేను కూడా అంతే జవాన్ సినిమాని ఆస్కార్స్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. షారుఖ్ సర్ తో నేను మాట్లాడి ఆస్కార్ కి పంపించే ప్రయత్నాలు చేస్తాను అని తెలిపాడు.

Bigg Boss 7 Day 15 : నామినేషన్స్ ఎపిసోడ్ మరీ ఇంత చప్పగానా? ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

అయితే ఈ విషయంలో అట్లీపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవల కొంతమంది ఆస్కార్ అంటే ఏదో సింపుల్ గా వచ్చే అవార్డు అని అనుకుంటూ ప్రతి సినిమాని ఆస్కార్ కి పంపిస్తాం అంటున్నారు. జవాన్ సినిమా మాములు పాత కమర్షియల్ కథ, సౌత్ వాళ్లంతా ఇలాంటి సినిమాలు చాలా చూసేసారు. నార్త్ వాళ్ళు ఇలాంటి కథని చూడకపోవడం, అట్లీ షారుఖ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేయడంతో ఈ సినిమా అక్కడ హిట్ అయింది, లేకపోతే ఇది ఫ్లాప్ సినిమా అని రిలీజ్ అయిన దగ్గర్నుంచి సినిమాపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని అన్ని సీన్స్ ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టినవే అని నెటిజన్స్ ట్రోల్ చేశారు. అట్లీ ఇప్పుడు ఆస్కార్ గురించి మాట్లాడటంతో ఇది మరీ ఓవర్ అంటూ పలువురు నెటిజన్లు, మీమర్స్ అట్లీ మీద ట్రోల్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు