Peddi: ‘పెద్ది’లో అదే హైలెట్.. అప్పల సూరి పాత్రపై బుచ్చిబాబు కామెంట్స్ వైరల్

పెద్ది(Peddi) సినిమాలో జగపతి బాబు పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.

Director Buchi Babu emotional comments about Jagapathi Babu Appalasuri character Peddi

  • బుచ్చిబాబు దాచిన సర్ప్రైజ్ ఎలిమెంట్స్.
  • కీలకంగా జగపతిబాబు అప్పల సూరి.
  • పెద్ది ప్రయాణంలో ఎమోషనల్ రైడ్.

Peddi: ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా జూన్ 4న భారీగా విడుదల కానుంది. అయితే, మిగతా దర్శకులకు చాలా డిఫరెంట్ గా ఉంటాడు బుచ్చిబాబుకు. ఆయన తన సినిమాలో ప్రధాన పాత్రలను, వాటి స్వభావాలను చాలా రహస్యంగా ఉంచుతరు. పెద్ది విషయంలో కూడా అంతే. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ లో ఎక్కడా కూడా కథలోని కీలక మలుపులను రివీల్ చేయకుండా, ప్రేక్షకులకు థియేటర్లలోనే అసలైన సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పోషిస్తున్న ‘పెద్ది(Peddi)’ పాత్రకు సంబంధించిన భావోద్వేగ ప్రయాణం సినిమాకు వెన్నెముకగా నిలవనుందని సమాచారం.

IBomma: సినీ ఇండస్ట్రీకి బిగ్ షాక్.. మళ్లీ వచ్చేసిన ‘ఐబొమ్మ’.. లిస్టులో కొత్త సినిమాలు

ఈ చిత్రంలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పల సూరి’ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఫస్టాఫ్ అంతా ఈ పాత్ర చుట్టూ బలమైన ఎమోషనల్ ఆర్క్ ఉంటుందని, కథను మలుపు తిప్పే కీలక శక్తిగా ఇది మారుతుందని టాక్. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రలోని తీవ్రతను, ఆ ప్రయాణంలోని లోతును బయటకు తీయడంలో అప్పల సూరి పాత్ర ప్రభావం చాలా బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి బుచ్చిబాబు ఒక స్వచ్ఛమైన ‘ఎమోషనల్ రోలర్ కోస్టర్’ రైడ్‌ను సిద్ధం చేస్తున్నారు. రామ్ చరణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, జగపతి బాబు పాత్ర ఇచ్చే ఎమోషనల్ టచ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెల్ని హత్తుకునే భావోద్వేగాలతో కూడిన ఒక అద్భుతమైన డ్రామాను వెండితెరపై చూసేందుకు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.