Director harish shankar interesting comments on pawan kalyan
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రీసెంట్ గా విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 26న విడుదల కానుంది.
Sravanthi Chokkarapu: రెడ్ కలర్ చీరలో నాజూకు వయ్యారం.. యాంకర్ స్రవంతి హాట్ ఫొటోలు వైరల్
ఈనేపథ్యంలోనే తాజా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) ప్రముఖ ఫిలిం జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు అందరు జర్నలిస్టులు కలిసి రౌండ్ టేబుల్ లాగా హరీష్ శంకర్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన సినిమాలు చేయడం ఎంత వరకు కరక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని హరీష్ శంకర్ ను అడిగాడు.
దానికి హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా ఆయన సినిమాలు చేయడం కరక్ట్. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలి. నన్ను అడిగితే ఆయన ఏడాదికో సినిమా చేయాలనీ చెప్తాను. దానికి కారణం, ఫ్యాన్స్ కోసం అని కాదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఎన్ని రకాల సేవాకార్యక్రమాలు ఆయన చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియదు. అలాంటివి ఇంకా ఆయన చేయాలంటే ఆర్థిక బలం అవసరం. అందుకే, ఆయన వరుసగా సినిమాలు చేయాలనీ నేను కోరుకుంటున్నాను. అప్పుడే ఆయన ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలరు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో, హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.