Harish shankar: త్వరలో పవన్ కళ్యాణ్ ని కలుస్తా.. 45 రోజుల్లో సినిమా తీస్తా.. రెండు సినిమాలకంటే పెద్ద హిట్ ఇస్తా
గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్(Harish shankar).
- V Santhosh Kumar
- Published On : April 12, 2026 / 02:23 PM IST
director harish shankar planning third film with pawan kalyan
- ముచ్చటగా మూడోసారి పవన్ తో మూవీ
- హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్
- 45 రోజుల్లో కంప్లీట్ అంటూ ఆసక్తికర కామెంట్స్
Harish shankar: డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్ శంకర్, మరో రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్నట్లు వెల్లడించారు. ఈ భేటీ ద్వారా కొత్త సినిమాపై స్పష్టత రానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన క్రేజ్‌ను మరోసారి వెండితెరపై ఒక రేంజ్ లో చూపించడానికి హరీష్(Harish shankar) సిద్ధమవుతున్నారు.
అయితే, ఇటీవల విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైన విషయం తెలిసిందే. దాంతో, నెక్స్ట్ సినిమాను చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ధురంధర్ 2 ఎఫెక్ట్ చాలా కనిపించింది. మార్చి 19న కాకుండా మార్చి 27న విడుదల చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది అంటి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఈ సారి తీయబోయే సినిమా గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే పెద్ద హిట్ అవుతుందని హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. విమర్శలను పట్టించుకోకుండా, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. దర్శకుడి మాటలు వింటుంటే, పవన్ కళ్యాణ్ అభిమానులకు వెండితెరపై పక్కా కమర్షియల్ విందు భోజనం దొరకడం ఖాయమనిపిస్తోంది. ఈ ప్రకటనతో ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ కాంబో గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి ముచ్చటగా మూడోసారి హరీష్ తో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా అనేది చూడాలి.
