Jason Sanjay : ఏడాదిన్న‌ర ప్రేమించుకున్నాం.. బ్రేక‌ప్ త‌రువాతే.. సిగ్మా ద‌ర్శ‌కుడు జాస‌న్ సంజ‌య్ కామెంట్స్‌..

తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు, ‘సిగ్మా’ దర్శకుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) మొద‌టి సారి తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడారు.

Director Jason Sanjay revealed his break up detalis

Jason Sanjay : తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు, ‘సిగ్మా’ దర్శకుడు జాసన్ సంజయ్ మొద‌టి సారి తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడారు. తన జీవితంలో ఒకే ఒక ల‌వ్‌స్టోరీ ఉంద‌న్నాడు. అది కూడా కాలేజీ రోజుల్లోన‌ని వెల్ల‌డించాడు. సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగిన ఆ బంధం పరస్పర అంగీకారంతో ముగిసిందని చెప్పాడు. ఆ బ్రేక‌ప్ త‌రువాత తాను మూవీస్‌పై దృష్టి పెట్టిన‌ట్లుగా వివ‌రించాడు.

‘నా జీవితంలో ఒకే ఒక ప్రేమ‌క‌థ ఉంది. అది కూడా కాలేజీ రోజుల్లో.. మేమిద్దరం సుమారు ఏడాదిన్నర పాటు ప్రేమలో ఉన్నాం. నేను విదేశాల్లో చ‌దువుకుంటున్న స‌మ‌యంలో మా మ‌ధ్య దూరం పెరిగింది. ఆ త‌రువాత ఇద్దరం మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నాం.’ జాసన్ సంజయ్ అని చెప్పారు.

Ariyana Glory : ప్యారెట్ గ్రీన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ భామ‌.. అరియానా గ్లోరీ ఫోటోలు వైర‌ల్..

బ్రేకప్ బాధ నుంచి ఎలా బ‌య‌ప‌డ్డార‌ని అడుగ‌గా.. ఆ సమయంలో యువన్ శంకర్ రాజా ప్రేమ పాటలన్నీ వినేవాడిన‌ని అన్నాడు. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండేవాడిన‌ని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి స్టోరీలు పెట్ట‌లేద‌న్నాడు. స్టోరీలు పెడితే పాత జ్ఞాప‌కాల్లో చిక్కుకుపోతామ‌ని భావించిన‌ట్లుగా తెలిపాడు. అందుకే ఇద్ద‌రం దూరం పాటించిన‌ట్లుగా చెప్పాడు. ప్ర‌స్తుతం అంతా బాగానే ఉంద‌ని, గ‌తాన్ని వ‌దిలేసి జీవితంలో ముందుకు సాగిపోతున్న‌ట్లుగా తెలిపాడు. ఆ త‌రువాత తాను సిగ్మా మూవీ ప‌నుల్లో బిజీ అయిన‌ట్లు వెల్ల‌డించాడు.

సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సిగ్మా మూవీలో సందీప్ కిష‌న్, ఫ‌రియా అబ్దుల్లా జంట‌గా న‌టించారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.