×
Ad

Jayashankar : ఏడేళ్ల క్రితం హిట్ కొట్టి.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వస్తున్న దర్శకుడు..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ జయశంకర్ నేడు మీడియాతో మాట్లాడారు.(Jayashankar)

Jayashankar

Jayashankar : పేపర్ బాయ్ సినిమాతో మంచి లవ్ స్టోరీని తెరకెక్కించి హిట్ కొట్టాడు జయశంకర్‌. సంతోష్ శోభన్ హీరోగా ఈ సినిమా 2018 లో వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పటివరకు జయశంకర్ నుంచి సినిమా రాలేదు. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు అరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ దర్శకుడు. సాయి కుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న అరి సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ జయశంకర్ నేడు మీడియాతో మాట్లాడారు.(Jayashankar)

ఎందుకు ఇన్నేళ్ల గ్యాప్ వచ్చింది అని అడగ్గా.. పేపర్ బాయ్ తర్వాత చేసే సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని, ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోవాలని, అందుకే ఇంత వరకి ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. అలాంటి కథ రెడీ చేయడానికి, అంత మంచి సినిమా చేయడానికి, దీనికి చేసిన రీసెర్చ్ కోసం ఇన్నేళ్ల టైం పట్టింది అన్నారు.

Also Read : Arya Dhayal : సింపుల్ గా పెళ్లి చేసుకున్న సింగర్.. తెలుగులో పాడింది ఒక్క పాటే.. కానీ చాలా ఫేమస్..

అరి సినిమా గురించి చెప్తూ.. అరి అంటే శత్రువు అని అర్ధం. అలాగే అరిషడ్వర్గాల్లో మెదటి రెండు పదాలు తీసుకోని సినిమాకి పేరు పెట్టాను. ఇంత వరకు రాని కాన్సెప్ట్‌తో అరి సినిమాని తీసాను. అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌కు మైథలాజికల్ టచ్ ఇవ్వడానికి ఈ సినిమా కోసం పరిశోధనలు చేశారు. కథను రాయడానికి పురాణేతిహాసాల్ని చదివాను. రమణ మహర్షి ఆశ్రమంతో పాటు చాలా మంది గురూజీలను కలిసి ఎన్నో విషయాలు సేకరించాను. అరిషడ్వర్గాలని అదుపులో ఎలా పెట్టుకోవాలో ఇంత వరకు గ్రంథాలలో చెప్పలేదు. ఈ సినిమా కోసం కొంత కాలం ఓ ఆశ్రమంలో గడిపి ఆధ్యాత్మిక కోణంలో అరిషడ్వర్గాల మీద అధ్యయనం చేశాను. అందుకే ఈ సినిమాకు ఇన్నేళ్లు పట్టింది అని తెలిపారు.

అలాగే.. ఈ సినిమాను రిలీజ్ కి ముందే పలు అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శించామని, ఇప్పటికే దాదాపు 25 అవార్డులు సాధించానని, దేశంలోని ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు ఈ సినిమాని చూసి అభినందించారని తెలిపాడు డైరెక్టర్ జయశంకర్. మరి ఇన్నేళ్ల గ్యాప్ తో జయశంకర్ తెస్తున్న అరి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Also Read : Mahesh Babu : మహేష్ బాబుకు అక్కగా, తల్లిగా నటించిన ఒకే ఒక నటి.. ఎవరో తెలుసా? అప్పట్లో హీరోయిన్..