Arya Dhayal : సింపుల్ గా పెళ్లి చేసుకున్న సింగర్.. తెలుగులో పాడింది ఒక్క పాటే.. కానీ చాలా ఫేమస్..
మలయాళం సింగర్ ఆర్య దయాల్ తాజాగా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. (Arya Dhayal)

Arya Dhayal
Arya Dhayal : మలయాళం సింగర్ ఆర్య దయాల్ తాజాగా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. మలయాళంలో స్టేజ్ షోలతో, తన మ్యూజిక్ బ్యాండ్ తో పాపులర్ అయిన ఆర్య దయాల్ ఆ తర్వాత సినిమాల్లో కూడా సింగర్ గా మారింది. సినిమాల్లో సింగర్ కంటే ముందే తన బ్యాండ్ తోనే కేరళలో ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఆమె బ్యాండ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెవి పలు సింగింగ్ వీడియోలు గతంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.(Arya Dhayal)
ఆర్య దయాల్ మలయాళ సినీ పరిశ్రమలో సింగర్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఆర్య దయాల్ గతంలో తెలుగులో కూడా ఓ పాట పాడింది. సూపర్ హిట్ బేబీ సినిమాలో దేవరాజ.. అని సాగే ఓ క్లాసిక్ పాప్ మిక్స్ సాంగ్ ని పాడింది. ఆర్య దయాల్ ఎక్కువగా పాప్ సాంగ్స్ తో పాటు మెలోడీ పాడుతుంది. తాజాగా ఆర్య దయాల్ తాను ప్రేమించిన అబ్బాయి అభిషేక్ ని సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తన పెళ్లి సర్టిఫికెట్ చూపిస్తూ తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also See : Manchu Lakshmi : మంచులో సాహసాలు చేస్తున్న మంచు లక్ష్మి.. ఐస్ ల్యాండ్ వెకేషన్..
ఆర్య దయాల్ భర్త కూడా సంగీత పరిశ్రమే అని తెలుస్తుంది. దీంతో ఆర్య దయాల్ కి ఫ్యాన్స్, పలువురు మలయాళ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సింగర్ గా మంచి ఫేమ్ ఉండి కూడా ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడంతో ఆమెని అభినందిస్తున్నారు.
View this post on Instagram
తెలుగులో ఆర్య దయాల్ పాడిన పాట ఇదే..
Also See : Ashwini Dutt : స్టార్ నిర్మాత కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు.. సందడి చేసిన లేడీ ప్రొడ్యూసర్స్..