Kalyan Shankar : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.. దర్శకుడి కామెంట్స్ వైరల్..

ఈ సినిమాలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా నటించడంతో ఈవెంట్ కి హాజరయ్యాడు. (Kalyan Shankar)

  • Updated on- September 4, 2026 / 09:13 PM IST

Kalyan Shankar

Kalyan Shankar : తాజాగా ఓ యువ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నేడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ఎపిక్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా నటించడంతో ఈవెంట్ కి హాజరయ్యాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో హిట్స్ కొట్టిన కళ్యాణ్ శంకర్ ఇప్పుడు నటుడిగా కూడా సినిమాలు చేస్తున్నాడు.

ఎపిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యాంకర్.. కళ్యాణ్ శంకర్ స్పీచ్ అయ్యాక డ్యాన్స్ వేయమని అడిగితే కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. నేను ఇప్పుడు డ్యాన్స్ వేయలేను. కావాలంటే డైలాగ్ చెప్తాను. నేను డ్యాన్స్ వేయొద్దు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి. దయచేసి నువ్వు డ్యాన్స్ వేయొద్దు అని నాకు మెసేజ్ లు పంపించారు అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Epic Trailer : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ ట్రైలర్ వచ్చేసింది.. రష్మిక చేతుల మీదుగా రిలీజ్..

కళ్యాణ్ శంకర్ ఎన్టీఆర్ ఫ్యాన్. మ్యాడ్ 2 సక్సెస్ ఈవెంట్లో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలోని నాయిరే నాయిరే.. సాంగ్ కి డ్యాన్స్ వేసాడు. తన మాస్ డ్యాన్స్ తో బాగానే మెప్పించాడు. ఆ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎన్టీఆర్ కూడా అభినందించారు. ఒకవేళ కళ్యాణ్ శంకర్ డ్యాన్స్ బాగోలేక ఎన్టీఆర్ ఫ్యాన్స్ డ్యాన్స్ వేయొద్దు అని భయపెట్టారా? లేక కళ్యాణ్ సరదాగా చెప్పారా అనేది చర్చగా మారింది.