Lokesh Kanagaraj : కాస్ట్ లీ కారు కొన్న లోకేష్ కనగరాజ్.. ఎన్ని కోట్లంటే..?
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోక నాయకుడు కమల్ హాసన్‌తో విక్రమ్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published on- August 17, 2023 / 08:02 PM IST
Lokesh Kanagaraj Buys BMW Car
Lokesh Kanagaraj Buys Car : లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోక నాయకుడు కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడితో సినిమాలు చేయాలని కోలీవుడ్‌లోని స్టార్ హీరోలే కాదు మిగిలిన ఇండస్ట్రీలోని హీరోలు వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. గ్యాంగస్టర్ సినిమాలతో ఓ సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలు కోలీవుడ్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లనే సాధించాయి.
Skanda Songs : ‘స్కంద’ సెకండ్ సాంగ్ రిలీజ్.. ‘గందరాబాయి’ అంటూ రామ్, శ్రీలీల మాస్ డాన్స్..
కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకులలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. తాజాగా ఆయన ఓ కాస్ట్ లీ కారును కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 series) కు చెందిన లేటెస్ట్ వర్షన్ కారును కొనుగోలు చేశాడు. దీని ధర అక్షరాల రూ.1.70కోట్లు. కారుతో లోకేష్ కనగరాజ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ‘విక్రమ్’ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో కమల్‌హాసన్ సైతం లోకేష్‌కు ఓ కాస్ట్ లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Chandramukhi 2 : ఎంఎం కీరవాణి లీక్స్.. చంద్రముఖి-2లో 10 పాటలు..!
ఇదిలా ఉంటే.. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay)తో ‘లియో’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష (Trisha), అర్జున్ (Arjun Sarja), సంజయ్ దత్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా డబ్బింగ్, సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెవన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ బాషల్లో రీలీజ్ కానున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ చిత్రం విజయం సాధించడంతో లియోపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Nayanthara : షారుక్ ఖాన్ కోసం మనసు మార్చుకున్న నయన్..? ఏ విషయంలోనంటే..?
