Meher Raamesh
Meher Ramesh : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రభాస్ తో బిల్లా సినిమా తీసిన దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం నెలకొంది. మెహర్ రమేష్ భార్య తల్లి, అతని అత్తమ్మ నేడు తెల్లవారుజామున మరణించారు. ఆమె మరణంతో మెహర్ రమేష్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు.(Meher Ramesh)
Also Read : Honey Review : ‘హనీ’ మూవీ రివ్యూ.. క్షుద్ర పూజలతో హారర్ థ్రిల్లర్..
తన అత్తమ్మ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ పద్మావతి శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7న పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు. ఇది మా కుటుంబానికి తీరని లోటు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసారు.
దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తూ మెహర్ రమేష్ కి సంతాపం ప్రకటిస్తున్నారు.