Meher Ramesh : ఫ్లాప్ డైరెక్టర్ మళ్ళీ నటుడిగా మారుతున్నారా? మహేష్ బాబు సినిమా తర్వాత..

ఈ కోవలోకి టాలీవుడ్ ఫ్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ చేరుతున్నాడని సమాచారం. (Meher Ramesh)

  • Published on- July 11, 2026 / 08:11 PM IST

Meher Ramesh

Meher Ramesh : అన్నీ సినీ పరిశ్రమలలో చాలా మంది దర్శకులు నటులుగా మారిన సంగతి తెలిసిందే. సీనియర్ దర్శకులు, కెరీర్ ముగిసిన దర్శకులు కూడా నటులుగా స్థిరపడుతున్నారు ఇటీవల. ఈ కోవలోకి టాలీవుడ్ ఫ్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ చేరుతున్నాడని సమాచారం.

ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి మహేష్ బాబు, చిరంజీవి కుటుంబాలతో మంచి స్నేహం ఉండి దర్శకుడిగా మారాడు. కన్నడ మెహర్ రమేష్ డైరెక్టర్ గా చేసిన వీర కన్నడిగా, అజయ్ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇవి ఆంద్రావాలా, ఒక్కడు సినిమాలకు రీమేక్. కానీ తెలుగులో మెహర్ తీసిన బిల్లా తప్ప కంత్రి, శక్తి, షాడో, భోళా శంకర్.. సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మిగిలాయి.

Also Read : Pramod Panju : అప్పుడు ‘సలార్’.. ఇప్పుడు ‘లెనిన్’.. ప్రీ క్లైమాక్స్ లో అఖిల్ ని డామినేట్ చేసిన ఈ నటుడు ఎవరో తెలుసా?

గతంలో మెహర్ రమేష్ మహేష్ బాబు బాబీ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నటించాడు. ఆ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఇటీవలే మెహర్ రమేష్ తన కూతురు పెళ్లి కూడా చేసేసాడు. ఇప్పుడు మెహర్ కి ఎవరూ దర్శకత్వం ఇచ్చే ఆలోచనలో లేరు. దీంతో మెహర్ మళ్ళీ నటుడిగా మారబోతున్నాడు అని తెలుస్తుంది.

ఆల్రెడీ ఒక సినిమాకు ఓకే చెప్పాడని, ఆ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని సమాచారం. 2002 లో బాబీ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు నటుడిగా మారబోతున్నారట మెహర్ రమేష్. మరి నటుడిగానే కంటిన్యూ అవుతారా? లేక ఈ ఒక్క సినిమా చేసి ఆగిపోతారా అనేది తెలియాల్సి ఉంది. మెహర్ నటుడిగా మారితే అతనికి ఉన్న సినీ సర్కిల్ కి అవకాశాలు బాగానే వస్తాయి.