Director Mysskin: ధనుష్ పై వివాదాస్పద కామెంట్స్.. నీకన్నా ఆయనే బెటర్.. దర్శకుడి కామెంట్స్ వైరల్
హీరో ధనుష్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు మిస్కిన్(Director Mysskin).
- V Santhosh Kumar
- Published on- May 21, 2026 / 08:32 PM IST
Director Mysskin makes shocking comments about Tamil star hero Dhanush
- ధనుష్ కంటే తండ్రే గొప్ప నటుడు.
- డైరెక్టర్ మిస్కిన్ సంచలన వ్యాఖ్యలు.
- మే 28న ‘హబిబి’ విడుదల.
Director Mysskin: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందిన మిస్కిన్(Director Mysskin) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరో ధనుష్ కంటే ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా వంద రెట్లు గొప్ప నటుడని ఆయన పేర్కొన్నారు. కస్తూరి రాజా ముఖ్య పాత్రలో నటించిన ‘హబిబి’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మిస్కిన్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు.
Rithu Chowdary: ఎల్లో అవుట్‌ఫిట్‌లో కట్టిపడేస్తున్న రితు చౌదరి.. క్రేజీ లుక్స్ తో గ్లామర్ రచ్చ
మొదట్లో కస్తూరి రాజా తీసిన సినిమాలు తనకు అస్సలు నచ్చేవి కావని, అవన్నీ పనికిరాని చిత్రాలని మిస్కిన్ ఘాటుగా విమర్శించారు. అయితే నటుడిగా మాత్రం ఆయన అద్భుతంగా రాణించగలరని ప్రశంసించారు. ఒక సినిమాలో ఆయన నటన చూసి ఫిదా అయ్యానని, ధనుష్ కంటే కూడా ఆయనే మెరుగైన నటుడని చెప్తూనే.. తనకు ధనుష్ అంటే ఇష్టం లేదని కాదని ఆయన వివరణ ఇచ్చారు.
ఇదే వేదికపై మిస్కిన్ తన వ్యక్తిగత సినిమా నిర్మాణ శైలి గురించి కూడా మాట్లాడారు. ఆత్మసంతృప్తి కోసం తాను తీసే చిత్రాల వల్ల కొన్నిసార్లు నష్టాలు వస్తాయని, ఆ అప్పులను తీర్చుకోవడానికి, జేబు నింపుకోవడానికి వెంటనే కమర్షియల్ సినిమాలు చేస్తుంటానని ఓపెన్‌గా ఒప్పుకున్నారు. కాగా మీరా కతిరవన్ దర్శకత్వంలో కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హబిబి’ సినిమా మే 28న థియేటర్లలో విడుదల కానుంది.
