Prashanth Neel: ‘డ్రాగన్’ మూవీ హీరో అనిల్ కపూర్.. ఆయనే విలన్.. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌కు ప్రశాంత్ నీల్ చెక్
Prashanth Neel: డ్రాగన్ సినిమాలో అనిల్ కపూర్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.
- V Santhosh Kumar
- Updated on- May 22, 2026 / 12:58 PM IST
Director Prashanth Neel interesting comments Anil Kapoor role in NTR Dragon movie
- ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ
- సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్లిమ్ప్స్ టీజర్ .
- అనిల్ కపూర్ విలన్ అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Prashanth Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’. వచ్చే ఏడాది జూన్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ టీజర్ చివర్లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్‌ను ఉద్దేశించి ‘హీరో’ అని సంబోధించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
*Nayan Sarika: రాకాస బ్యూటీ నయన్ సారిక.. బ్లాక్ శారీలో గ్లామర్ కేక.. ఫొటోలు
ఈ ‘హీరో’ అనే పదంపై ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సినిమాకు మెయిన్ హీరో ఎన్టీఆర్ కాదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)ఈ కన్ఫ్యూజన్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనిల్ కపూర్ ను నేను ‘హీరో’ అని పిలుస్తున్నానంటే, దానికి కారణం ప్రపంచమంతా ఆయన్ని అలాగే పిలవడమే; కానీ నిజానికి ఆయన మాకు ‘అతిపెద్ద విలన్’. ఈ సినిమాలో మాకు వేరే హీరోలు కూడా ఉన్నారు” అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ కేవలం తెరపై హీరోగా కనిపిస్తూ, తెరవెనుక కుట్రలు చేసే ఒక విలక్షణమైన నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎన్టీఆర్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా అనిల్ కపూర్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ నటన తోడైతే థియేటర్లలో పూనకాలే అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు.
