×
Ad

Varanasi: ‘వారణాసి’ స్టార్స్ కి భారీ రెమ్యునరేషన్స్.. మహేష్ కంటే జక్కన్నకే ఎక్కువ.. ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇంటర్నేషనల్ మూవీ వారణాసి(Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

Director Rajamouli is charging more than Mahesh Babu for Varanasi Movie

Varanasi: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇంటర్నేషనల్ మూవీ వారణాసి(Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. భారీ గ్రాఫిక్స్ తో, హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా కోసం ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమాపై ఇంటర్నేషనల్ లెవల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన స్పెషల్ వీడియోకి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే రేంజ్ లో సినిమాను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Mass Jathara OTT: రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీకి వస్తున్న మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే..

ఇదిలా ఉంటే, వారణాసి సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, వారణాసి సినిమాలో నటిస్తున్న, పనిచేస్తున్న మెయిన్ స్టార్స్ రెమ్యునరేషన్స్ ఒక రేంజ్ లో తీసుకుంటున్నారట. వారిలో ముందుగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్ల భారీ మొత్తాన్ని పారితోషకంగా తీసుకుంటున్నాడట. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడట. ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రాకు రూ.32 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇక విలన్ గా చేస్తున్న మలయాళ నటుడు ప్రిథ్వీరాజ్ సుకుమారన్ కి రూ.16 కోట్ల వరకు పారితోషకం ఇస్తున్నారని తెలిస్తోంది.

వారణాసి సినిమాకు మ్యూజిక్ అందించే భాద్యతను భుజాన వేసుకున్న ఎంఎం కీరవాణి సైతం రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. దీంతో ఈ లెక్కలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రూ.1000 కోట్ల ప్రాజెక్టులో కేవలం రెమ్యునరేషన్స్ కోసమే ఏకంగా రూ.400 కోట్ల వరకు ఖర్చు చేయడం విశేషంగా మారింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, హీరో మహేష్ బాబు కంటే దర్శకుడు రాజమౌళినే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఆ రేంజ్ లో తీసుకుంటున్నాడని టాక్. ఇక ఈ సినిమా 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.