Ram Gopal Varma: రణవీర్ క్రేజ్ ను ఓర్వలేకనే.. ముందు ఫిల్మ్ ఫెడరేషన్ ను బ్యాన్ చేయాలి.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).

Director Ram Gopal Varma shocking comments regarding ban on ranveer singh

  • రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం విధింపు.
  • ఫిల్మ్ ఫెడరేషన్‌పై ఆర్‌జీవీ ఆగ్రహం.
  • స్టార్ల వల్లే కార్మికులకు ఉపాధి.

Ram Gopal Varma: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) విధించిన నిషేధాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తీవ్రంగా తప్పుపట్టారు. ‘డాన్ 3’ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ పరిణామంపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. అసలు ఆ ఫిల్మ్ ఫెడరేషన్‌పైనే నిషేధం విధించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నిషేధం పరిశ్రమను లేదా కార్మికులను రక్షించడానికి కాదని, కేవలం ఫెడరేషన్ తన పట్టును నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని వర్మ విమర్శించారు.

Manchu Manoj: మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో

లక్షలాది మంది కార్మికుల తరఫున మాట్లాడుతున్నామని చెబుతున్న ఈ సంస్థకు ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేదన్నారు. చట్టపరమైన నిబంధనలను పక్కనబెట్టి, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ముందే నిర్ణయించుకున్న ఎజెండాతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘ధురంధర్’ విజయంతో రణ్‌వీర్ సాధించిన క్రేజ్ చూసి భయపడుతోన్న కొందరు నటులు కూడా ఇందులో ఉన్నారని పేర్కొన్నారు. థియేటర్లలో టికెట్లు అమ్ముడయ్యేది రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్ల వల్లే తప్ప ఇలాంటి సంస్థల వల్ల కాదని ఆర్‌జీవీ స్పష్టం చేశారు. రణ్‌వీర్ లాంటి అగ్ర హీరోలే పరిశ్రమలోని లక్షలాది మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారనే నిజాన్ని గ్రహించాలని ఆయన హితవు పలికారు. దీంతో రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. మరి ఇండస్ట్రీ పెద్దలు ఆయన కామెంట్స్ కి ఎలా స్పందించారు అనేది చూడాలి.