Manchu Manoj: మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj).
Manchu Manoj cleans Dasari Narayana Rao memorial.
- దాసరి సమాధిపై మనోజ్ స్పందన.
- స్వయంగా పరిసరాల శుభ్రం పనులు.
- నెటిజన్ల నుండి పెరిగిన ప్రశంసలు.
Manchu Manoj; దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి నిర్లక్ష్యానికి గురై, చెత్తాచెదారంతో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్న మహానుభావుడి సమాధి దయనీయ స్థితిని చూసి హీరో మంచు మనోజ్ తీవ్రంగా కలత చెందారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తానని సోషల్ మీడియా వేదికగా హామీ ఇచ్చారు.
Vasanthi krishnan: మహాదేవుని సన్నిధిలో వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్.. ఫ్యామిలీతో ఫోటోలు వైరల్
మాట ఇచ్చినట్టుగానే మనోజ్(Manchu Manoj) శనివారం ఉదయం 7 గంటలకే తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. షూటింగ్‌కు వెళ్లే ముందు సమయం కేటాయించి, సమాధి పరిసరాల్లోని ఎండుటాకులను స్వయంగా తొలగించారు. మనోజ్, మౌనిక భూమా దంపతులు స్థాపించిన “ఐక్య ధైర్య సేన” సమితి ద్వారా ఈ తక్షణ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. సమయస్ఫూర్తితో స్పందించి దాసరి గారిపై గౌరవాన్ని చాటుకున్న మనోజ్‌ను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు. వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

