Ravi Babu: అవును సినిమాకి ఏనుగు పోస్టర్.. ఫోన్ చేసి మరీ తిట్టారు.. వాళ్లకు అలా అర్థమయ్యింది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో వినూత్నంగా సినిమాలు చేసే దర్శకులు చాలా కొంతమంది ఉన్నారు. అందులో దర్శకుడు రవి బాబు(Ravi Babu) ఒకరు. అల్లరి సినిమాతో దర్శకుడిగా మారిన ఈ నటుడు మొదటి సినిమాతోనే తన మార్క్ ను చూపించుకున్నాడు.
Director Ravi Babu made interesting comments about Avunu movie
Ravi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వినూత్నంగా సినిమాలు చేసే దర్శకులు చాలా కొంతమంది ఉన్నారు. అందులో దర్శకుడు రవి బాబు(Ravi Babu) ఒకరు. అల్లరి సినిమాతో దర్శకుడిగా మారిన ఈ నటుడు మొదటి సినిమాతోనే తన మార్క్ ను చూపించుకున్నాడు. ఈయన సినిమాలు, కథలు, ఆ కథలను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటాయి. ఒక సినిమాచూసి ఆ దర్శకుడు ఎవరు అని చెప్పడం చాలా కష్టం. కానీ, రవి బాబు సినిమాలను ఈజీగా చెప్పేయగలం. అయితే, చాలా కాలంగా సినిమాలు చేయడంలేదు. చాలా గ్యాప్ తీసుకొని ఆయన తెరకెక్కించిన సినిమా ఏనుగుతొండం ఘటికాచలం. సీనియర్ నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది.
Tamannaah Bhatia: వైట్ ఫ్రాక్ లో మెరుపుతీగలా.. మెరిసిపోతున్న తమన్నా.. ఫోటోలు
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు రవి బాబు తన సినీ జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. “నేను చేసిన మంచి సినిమాల్లో అవును ఒకటి. ఆ సినిమా విడుదల సమయంలో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే.. అవును సినిమాలో హీరోయిన్ పెద్ద సమస్యలో పడుతుంది. ఆ పాయింట్ అర్థం అయ్యేలా ఏనుగును పోస్టర్ లో వేషం. ఎందుకంటే, ఏనుగు పెద్ద జంతువు కాబట్టి అంత పెద్ద సమస్య హీరోయిన్ వచ్చింది అని చెప్పడం కోసం. ఆ పోస్టర్ చూసిన ఒక వ్యక్తి నాకు కాల్ చేసి ఫుల్లుగా తిట్టాడు. పోస్టర్ లో ఏనుగు ఉందని పిల్లల్ని తీసుకొని వెళ్తే సినిమాలో ఏనుగు లేదు అన్నాడు. ఒక మహిళ ఫోన్ చేసి.. శరీరం లేని వ్యక్తి హీరోయిన్‌ను ఎలా కోరుకుంటాడు అంటూ వాదించారు.
ఇలా ప్రేక్షకులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కాబట్టి, సినిమాల విషయంలో ప్రతిది జాగ్రత్త పాటించాలి. నేను విలన్‌గా చేశాను. కొంతమంది నన్ను ఇప్పటికీ అలాగే అనుకోని బాహాయపడతారు. సినిమాలు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి, సున్నితమైన విషయాలను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి” అంటూ ఆ సినిమా విషయంలో చాలా సంఘటనలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చాడు రవి బాబు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .
