karuppu: త్రిష ఎందుకు అన్నారు.. వాళ్లందరికీ ఒకే సమాధానం

కరుప్పు(karuppu) సినిమాలో త్రిషను అందుకే తీసుకున్నాను.

director rj balaji interesting comments on trisha

సూర్య హీరోగా వీరభద్రుడు మూవీ

మే 14న విడుదల కానున్న మూవీ

హీరోయిన్ త్రిషపై దర్శకుడు ఆసక్తికర కామెంట్స్

karuppu: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానున్న ఈ సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ, సినిమా నిర్మాణ విశేషాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సూర్య సరసన నటించిన త్రిష ఎంపిక గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

Sandeep Kishan: ఎట్టకేలకు మొదలైన ‘పవర్ పేట’.. ఆసక్తిరేపుతున్న పోస్టర్

గతంలోనే త్రిషతో సినిమా చేయాలని ప్రయత్నించినప్పటికీ, అది ఇప్పుడు ‘కరుప్పు(karuppu)’తో సాధ్యమైందని బాలాజీ తెలిపారు. కథ వినగానే ఆమె ఎంతో ఉత్సాహంగా నటించేందుకు ఒప్పుకున్నారని, తన పాత్ర షూటింగ్ పూర్తయినప్పటికీ సెట్స్‌కు వచ్చి చిత్ర బృందంతో సమయం గడిపేవారని ఆయన ప్రశంసించారు. విశేషమేమిటంటే, ‘ఆరు’ సినిమా తర్వాత దాదాపు 22 ఏళ్ల విరామం అనంతరం సూర్య, త్రిష జోడీ మళ్లీ ఈ సినిమా కోసం వెండితెరపై సందడి చేయబోతోంది. ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ అవ్వడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

దర్శకుడిగా ‘అమ్మోరు తల్లి’, ‘వీట్ల విశేషం’ వంటి సినిమాలతో మెప్పించిన బాలాజీ, ఈసారి ఒక సీరియస్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సూర్య మార్క్ యాక్షన్, త్రిష గ్లామర్, బాలాజీ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి వేసవి కానుకగా మే నెలలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.