Saailu Kampati: రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కొత్త సినిమా.. స్టార్ ప్రొడ్యూసర్ తో భారీ ప్రాజెక్టు సెట్
రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటి(Saailu Kampati) కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్.
- V Santhosh Kumar
- Published On : February 19, 2026 / 02:04 PM IST
Director Saailu Kampati doing his second film Asian cinemas.
Saailu Kampati: రాజు వెడ్స్ రాంబాయి.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక సినిమాలో క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, ఈ సినిమా విషయంలో క్రెడిట్ అంతా దర్శకుడు సాయిలు కంపాటికె వెళుతుంది. వస్తావ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఆ కథను అంతే వాస్తవికంగా తెరకెక్కించి శెభాష్ అనిపించుకున్నాడు ఈ దర్శకుడు.
ఇక అప్పటినుంచి సాయిలు (Saailu Kampati)తన రెండో సినిమా ఎప్పుడు చేస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు అంటూ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమా విడుదలై మూడు నెలలు గడుస్తున్నా సాయిలు నెక్స్ట్ సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపధ్యంలోనే దర్శకుడు సాయిలు నెక్స్ట్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AA23: అల్లు అర్జున్ ను కలిసిన లోకేష్.. AA23 గురించి క్రేజీ అప్డేట్
అదేంటంటే, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసియన్ మూవీస్ దర్శకుడు సాయిలు కోసం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట. యంగ్ హీరోతో ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చేయాలనీ ప్రపోజల్ పెట్టిందట. అందుకోసం అడ్వాన్స్ కూడా గట్టిగానే ముట్టజెప్పారట. ఇంతకాలం ఆ కథను సిద్ధం చేయడానికి టైం తీసుకున్నాడట సాయిలు. ఇటీవలే ఫైనల్ న్యారేషన్ కూడా కంప్లీట్ అవడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారట.
రాజు వెడ్స్ రాంబాయి లాగానే ఈ సినిమా కూడా రా అండ్ రస్టిక్ గా ఎమోషనల్ కంటెంట్ తో రానుందట. ప్రస్తుతం ఆ కథకు సరిపడే యంగ్ హీరో కోసం వేట మొదలుపెట్టాడట సాయిలు. హీరో ఫైనల్ అవగానే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయాలనీ చూస్తున్నారట. అయితే, ఈసారి లిమిటెడ్ బడ్జెట్ లో కాకుండా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా చేయనున్నాడట దర్శకుడు సాయిలు. 2026 ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి తన రెండో సినిమాతో దర్శకుడు సాయిలు ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.
