Sekhar Kammula: హ్యాపీ డేస్ కి సీక్వెల్.. రెండు కథలు సిద్ధం.. శేఖర్ కమ్ముల సెట్ చేస్తున్న హీరో ఎవరో తెలుసా?
క్రేజీ కాంబోలో హ్యాపీ డేస్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula).
- V Santhosh Kumar
- Updated on- March 4, 2026 / 12:35 PM IST
Director Sekhar Kammula planning a sequel for Happy Days movie
- కుబేర తరువాత రెండు కథలు సిద్ధం చేస్తున్న శేఖర్ కమ్ముల
- అందులో ఒకటి హ్యాపీ డేస్ సీక్వెల్
- త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
Sekhar Kammula: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అంటే దర్శకుడు శేఖర్ కమ్ముల అనే చెప్పాలి. మొదటి సినిమా ఆనంద్ నుంచి మొన్నొచ్చిన కుబేర వరకు ఆయన తాలూకు ఆ సిసిబిలిటీస్ క్లియర్ గా కనిపిస్తాయి. అందుకే,. శేఖర్ కమ్ముల సినిమాలుక్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆయన తెరకెక్కించిన సినిమాల్లో హ్యాపీ డేస్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.
2007లో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ భారీ విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో నలుగురు స్నేహితుల కథతో వచ్చిన ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినా మిస్ అవకుండా చూసేవాళ్ళు ఉన్నారు అంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కుబేర తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) రెండు కథను సిద్ధం చేస్తున్నాడట.
Ram Charan: హై ఫీవర్ లో రామ్ చరణ్ డాన్స్.. షూటింగ్ ఆపేద్దాం అన్నా ఆగలేదు.. మీ డెడికేషన్ కి
అందులో ఒకటి హ్యాపీ డేస్ 2 అని సమాచారం. జెన్ సి కిడ్స్ కి బాగా సెట్ అయ్యేలా ఈ కథను సిద్ధం చేస్తున్నాడట శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఈ కథ కూడా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ కథతో పాటు మరో రెగ్యులర్ కథను కూడా రెడీ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. ఈ రెండు కథల్లో ఏది ముందు ఒకే అయితే అదే కథతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట శేఖర్ కమ్ముల.
అయితే, ఈ రెండు కథల ఫైనల్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరు హీరోగా చేస్తారు అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. మరి బ్లాక్ బస్టర్ హ్యాపీ డేస్ సీక్వెల్ ఇప్పటి జెన్ జీ కిడ్స్ కి ఏమాత్రం ఎక్కుతుందా అనేది చూడాలి.
