Srikanth odela : ప్యారడైజ్ ఎఫెక్ట్! చిరు మూవీకి ముందు షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న శ్రీకాంత్ ఓదెల‌!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా విషయంలో (Srikanth odela) ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Director Srikanth odela will take a break before chiranjeevi movie

Srikanth odela : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నాని హీరోగా ఓదెల తీసిన ది ప్యారడైజ్ షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు సాగడంతో, ఆ ప్రభావం శ్రీకాంత్‌ నెక్స్ట్‌ ప్రాజెక్టుల షెడ్యూల్‌పై పడినట్టు టాక్.

ప్యారడైజ్ షూట్ 160 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసినా 170 రోజులు పట్టిందని శ్రీకాంత్ ఓదెలనే చెప్పాడు. ఇక చిరంజీవితో సినిమా మాత్రం తప్పకుండా జరుగుతుందని, ప్యారడైజ్ రిలీజ్‌ తర్వాత బ్రేక్ తీసుకొని తర్వాత స్టార్ట్ చేస్తానని ఓదెల చెప్పడం ఆసక్తిని పెంచుతోంది.

Dil Raju : సిద్ధివినాయ‌కుడిని ద‌ర్శించుకున్న నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ..

ఇదిలా ఉంటే.. నాని బిజీ కమిట్‌మెంట్లు, ప్యారడైజ్ కోసం జరిగిన లాంగ్ టర్మ్ వర్క్ కారణంగా చిరంజీవి, ఓదెల సినిమా ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు నాని నిర్మాతగా ఉండటంతో, ఒక ప్రాజెక్ట్ షెడ్యూల్ మరో ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపుతోందా అనే చర్చ మొదలైంది.

అదే సమయంలో నాని నెక్స్ట్‌ ప్రాజెక్టు హిట్‌-4 విషయంలోనూ షెడ్యూల్‌పైనే గందరగోళం కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ టాక్ ప్రకారం చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమాకు బ్రేక్ మాత్రమే పడిందని అంటున్నారు. మరోవైపు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను కచ్చితంగా చేసి తీరుతారనని అంటున్నారు. ప్యారడైజ్ విడుదల తర్వాత ఓదెల తీసుకునే బ్రేక్ ఎంతకాలం ఉంటుంది.? చిరంజీవి సినిమా ఎప్పుడు మొదలవుతుంది.? మధ్యలో నాని HIT-4 లైన్‌లోకి వస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.