Suriya 46: సూర్య సినిమాకు డిఫరెంట్ టైటిల్.. వెంకీ భలే ఐడియా సెట్ చేశాడు
సూర్య(Suriya 46)- వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న సినిమాకు డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : February 1, 2026 / 11:10 AM IST
Director Venky Atluri finalized different title for Suriya next film.
- సూర్య- వెంకీ అట్లూరి కాంబోలో సినిమా
- డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
- త్వరలోనే అధికారిక ప్రకటన
Suriya 46: తమిళ స్టార్ సూర్య గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈనేపధ్యంలోనే నెక్స్ట్ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు సూర్య. అందులో భాగంగానే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథను ఒకే చేశాడు. సితార ఎంటెర్టైనెర్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి వెంకీతో సూర్య(Suriya 46) సినిమా అనగానే ఈ ప్రాజెక్టుపై పాజిటీవ్ ముందు నుంచి క్రియేట్ అయ్యింది.
ఎందుకంటే, వెంకీ అట్లూరి గతంలో చేసిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు సూపర్ హిట్ కావడమే. దాంతో, ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అని ఫిక్స్ అయిపోయారు అంతా. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సరికొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమాకు అంతే కొత్తగా ఉండేలా టైటిల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
Kayadu Lohar: చీరలో ఫంకీ బ్యూటీ కాయాదు లోహర్.. ఈవెంట్ ఫొటోలు వైరల్
అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి క్రెసీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు విశ్వనాథం అండ్ సన్స్ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. పాన్ ఇండియా లెవల్లో యూనివర్సల్ అపీల్ ఉండేలా ఈ టైటిల్ ను ఫిక్స్ చేశాడట దర్శకుడు. మిగతా భాషలలో కూడా సెట్ అయ్యేలా ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారట.
ఈ న్యూస్ తెలియడంతో సూర్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ కూడా చాలా పాజిటీవ్ గా ఉండటంతో సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇదే టైటిల్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్. మమిత బైజు కీ రోల్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో సూర్య ఏ రేంజ్ హిట్ సాధిస్తాడు అనేది చూడాలి.
