Allu Arjun : దర్శకుడు VI ఆనంద్‌తో బన్నీ సినిమా.. కథ చెప్పాను కానీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

గతంలో VI ఆనంద్ - అల్లు అర్జున్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.. సినిమా ఉందా అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు.

Director VI Anand Movie with Allu Arjun gives Clarity in Ooru peru Bhairavakona Movie Promotions

Allu Arjun : టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కోరాజా.. లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు VI ఆనంద్. తెలుగులో కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయాలంటే VI ఆనంద్ ముందుంటారు. సందీప్ కిషన్(Sundeep Kishan), వర్ష బొల్లమ్మ జంటగా VI ఆనంద్ ఇప్పుడు ఊరుపేరు భైరవకోన సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.

ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా దర్శకుడు VI ఆనంద్ మీడియాతో ముచ్చటించగా పలు ఆసక్తికర విషయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో VI ఆనంద్ – అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.. సినిమా ఉందా అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు.

దీనికి VI ఆనంద్ సమాధానమిస్తూ.. ఔను. నేను బన్నీ గారితో సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కథలను ఆయనకు వినిపించాను. ఒక సైఫై కథని కూడా వినిపించాను. కానీ బన్నీ గారు ఇంకా కొంచెం పెద్ద కథ, ఆసక్తిగా ఉన్న కథ కావాలని అడిగారు. అప్పుడు నేను అలాంటి కథలు రాయలేదు. త్వరలో అల్లు అర్జున్ గారిని మళ్ళీ కలుస్తాను. ఆయనతో సినిమా భవిష్యత్తులో ఉండొచ్చు. ఊరుపేరు భైరవకోన తర్వాత గీత ఆర్ట్స్ లో నిఖిల్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని తెలిపారు.

Also Read : Mahi V Raghav : రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసింది? ‘యాత్ర’ దర్శకుడు మ‌హి వి.రాఘ‌వ్‌ సంచలన వ్యాఖ్యలు..

దీంతో దర్శకుడు VI ఆనంద్ – అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా కచ్చితంగా ఉండబోతుందని తెలుస్తుంది. VI ఆనంద్ సినిమా అంటే కొత్త తరహా కథతో కచ్చితంగా ఆసక్తిగా ఉంటుంది. VI ఆనంద్ చేసిన కామెంట్స్ తో బన్నీ అభిమానులు కూడా వీరి కాంబోలో ఓ సినిమా పడితే బాగుండు అని అనుకుంటున్నారు. ఇక VI ఆనంద్ ఆల్రెడీ అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమా చేశారు.

ట్రెండింగ్ వార్తలు