Operation Sindoor: కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడి మరో సంచలనం.. ‘ఆపరేషన్ సిందూర్’ మూవీకి రంగం సిద్ధం

'ఆపరేషన్ సిందూర్' కథ ఆధారంగా సంచలన సినిమా చేస్తున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Operation Sindoor).

Director Vivek Agnihotri making a film based on Operation Sindoor

  • ‘ఆపరేషన్ సిందూర్’పై భారీ సినిమా
  • వివేక్ అగ్నిహోత్రి- టీ సిరీస్ సంయుక్తంగా సెన్సేషనల్ ప్రాజెక్టు
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Operation Sindoor: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో సంచలన దేశభక్తి చిత్రానికి రంగం సిద్ధం అయ్యింది. వివాదాస్పద, విజయవంతమైన చిత్రాల దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ ఈ భారీ ప్రాజెక్టు కోసం చేతులు కలిపారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనే భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.

పాకిస్తాన్ పై భారత సైన్యం సాహసోపేతంగా చేపట్టిన కీలక సైనిక చర్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ముఖ్యంగా 2025లో పహల్గాం వేదికగా పర్యటకులపై జరిగిన ఘోర మారణకాండకు ప్రతీకారంగా, భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన మెరుపు దాడులను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. ‘టైనీ’ ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్ సైడ్ పాకిస్థాన్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది.

భారత సరిహద్దులు దాటి మన సైనికులు చేసిన వీరోచిత పోరాటం, పహల్గాం ఘటన వెనుక ఉన్న కుట్రలను ఛేదించిన తీరును ఈ కథలో ప్రధానంగా చూపించబోతున్నారు మేకర్స్. దేశభక్తిని రగిలించే ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. మరి సెన్సేషనల్ కథతో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.