Meera Mitun : లొకేషన్‌లో సిగరెట్ తాగిన బ్యూటీ.. డైరెక్టర్ వార్నింగ్..!
తమిళ నటి మీరా మిథున్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో ఉంటారు. ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు నెటిజన్లు చివాట్లు పెడుతూనే ఉంటారు. అయినా ఈ అమ్మడి ప్రవర్తనలో మాత్రం మార్పు కనిపించదు. మోడల్ గా కెరియర్ ప్రారంభించి, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఈ నటి.. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
- kunduru Vinod
- Published On : July 15, 2021 / 12:23 PM IST
Meera Mitun
Meera Mitun : తమిళ నటి మీరా మిథున్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో ఉంటారు. ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు నెటిజన్లు చివాట్లు పెడుతూనే ఉంటారు.. అయినా ఈ అమ్మడి ప్రవర్తనలో మాత్రం మార్పు కనిపించదు. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన మీరా, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఈ నటి.. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
కాగా సినిమా షూటింగ్ సమయంలో ఈమె వ్యవహారశైలి దర్శకుడికి కోపం తెప్పించిందట దీంతో అతడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ప్రస్తుతం మీరా ‘పేయైు కాణోమ్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కౌశిక్ అనే యువ నటుడు తొలిసారి హీరోగా పరిచయం కానున్నాడు. అన్బరసన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. సాధారణంగానే సిగరెట్ తాగే అలవాటు ఉన్న మీరా, ఇటీవల షూటింగ్ లొకేషన్‌లో సిగరెట్ తాగుతుండగా చూసిన దర్శకుడు కాస్త అసహనం వ్యక్తం చేశాడట.
స్మోకింగ్ వ్యక్తిగత వ్యవహారం..షూటింగ్ లొకేషన్‌లో అలా సిగెరెట్లు తాగడం సరికాదని, కేరవాన్‌లో తాగి రావాలని చెప్పాను. ఆ తర్వాత ఆమె ఇది రిపీట్ చేయలేద’ని సదరు దర్శకుడు తెలిపారు.
