Pawan Kalyan: క్యూలో దర్శకులు.. కండిషన్స్ అప్లై అంటున్న పవర్ స్టార్!

పవన్ కల్యాణ్ కండీషన్స్ అప్లై అంటున్నారు. తనతో సినిమా చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కావాల్సిందే. పవర్ స్టార్ షరతులకు లోబడే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ క్యూలో..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కండీషన్స్ అప్లై అంటున్నారు. తనతో సినిమా చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కావాల్సిందే. పవర్ స్టార్ షరతులకు లోబడే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. క్రిష్ నుంచి సముద్రఖని దాకా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన సెట్ ఆఫ్ రూల్స్ ను పవన్ రిలీజ్ చేశారు.

Pawan Kalyan: పవర్ స్టార్ మరో సినిమా.. రావణాసుర దర్శకుడితో చర్చలు!

దసరా కన్నా ముందే రెండు ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాలనేది పవన్ ఫస్ట్ ప్లాన్. దానికి తగ్గట్టే తన డైరెక్టర్స్ ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే 50శాతానికి పైగా పూర్తయిన హరిహర వీరమల్లును నాలుగు నెలల్లో పూర్తి చేసేలా క్రిష్ కి టార్గెట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 6న రీస్టార్ట్ కాబోతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా అయిపోవాలి. సో ఈ డెడ్ లైన్ తోనే పవన్, క్రిష్ కొత్తగా తోటతరణి వేసిన సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు.

Pawan Kalyan: పవన్‌కు మరోసారి అదే వాయింపుడు?

హరిహర వీరమల్లు తర్వాత పవన్ లిస్ట్ లో వినోదయ సిత్తం రీమేక్ ఉంది. ఒరిజనల్ తమిళ్ మూవీని తెరకెక్కించిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా తెరకెక్కించబోతున్నాడు. కేవలం 30 రోజుల్లోగా తన పార్ట్ ను కంప్లీట్ చేయాలనేది సముద్రఖనికి పవన్ పెట్టిన కండీషన్. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో పవన్ కాంబినేషన్ గా సాయిధరమ్ తేజ్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత వెరీ రీసెంట్ గా తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొన్న సాయితేజ్.. నెక్ట్స్ పవన్ తోనే నటిస్తాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు