ముద్దు సీన్ కోసం సాహసం: రెండు రోజుల పాటు!

  • Publish Date - January 5, 2020 / 02:47 AM IST

ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశా పటాని, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మలంగ్‌’. మోహిత్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తుంది చిత్రయూనిట్. అందులో భాగంగానే హీరోహీరోయిన్లకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్‌ హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ భూజాల మీద కూర్చొని దిశ అతడి లిప్‌ లాక్‌ చేస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టిల్‌ విడుదలైన తరువాత సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది. పోస్టర్‌లోనే ఇంత ఘాటు రొమాన్స్‌ ఉంటే సినిమాలో ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో అన్న టాక్‌ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో ఓ కిస్‌ సీన్‌లో నటించేందుకు సాహసమే చేశారట హీరోహీరోయిన్లు. హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ సినిమాలో అండర్‌ వాటర్‌లో ఓ కిస్‌ సీన్‌ ఉంది. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారట చిత్రయూనిట్. అంతసేపు అండర్‌ వాటర్‌లో నటించేందుకు వారి లంగ్‌ కెపాసిటీని పెంచేందుకు ట్రైనింగ్ ఇచ్చారట. సింగిల్‌ షాట్‌లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తీశారట చిత్రయూనిట్.  

ట్రెండింగ్ వార్తలు