Kalki 2898 AD : ఇటలీ షూటింగ్ సెట్స్ నుంచి.. ప్రభాస్, దిశా పటాని ఫొటో వచ్చేసింది..

ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని పై సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా అక్కడి నుంచి ఓ ఫొటో వచ్చింది.

Disha Patani Prabhas Photo from Kalki 2898 Ad Movie Shooting sets

ప్రభాస్, దీపికా పదుకోన్, దిశా పటాని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇండియన్ ఫ్యూచరిస్టిక్ ఫిలింగా రూపొందుతుంది. సి అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని పై మూవీలోని చివరి సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఆ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ షేర్ చేస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే నిన్న మూవీ యూనిట్ అంతా కలిసి ఉన్న ఫొటో షేర్ చేసిన నిర్మాతలు. ఈరోజు ఉదయం.. ప్రభాస్ ని దిశా ఫొటో తీస్తున్న పిక్ ని షేర్ చేసారు. తాజాగా మూవీ లొకేషన్ లో ఉన్న ప్రభాస్ అండ్ దిశా పటాని ఫోటోని షేర్ చేసారు. ఆ పిక్ లో ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ ని ఫుల్ రొమాంటిక్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Also read : Premikudu : రీ రిలీజ్ మూవీని భారీ రేటుని కొనుగోలు.. లేటెస్ట్‌గా వస్తున్న ‘ప్రేమికుడు’..

కాగా రేపు శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ లేదా సాంగ్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. దీంతో అభిమానులంతా రేపు ఏ అప్డేట్ రాబోతుందో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఓ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది. కానీ ఆ చిన్న గ్లింప్స్ తోనే ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసిన మూవీ టీం.. ఇప్పుడు టీజర్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఓ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ వంటి తారలు కూడా కొన్ని ముఖ్య పాత్రల్లో చేస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు