Disha Patani : కల్కి కోసం నడుము మీద టాటూ వేసుకున్న దిశా పటాని.. అది ఏ భాష? దాని అర్ధం ఏంటి అంటే.. ?

కల్కి కోసం దిశా పటాని ఈ టెంపరరీ టాటూని వేయించుకున్నట్టు తెలుస్తుంది.

  • Published On : July 9, 2024 / 08:49 AM IST

Disha Patani Tattoo for Kalki Movie in a new Language Tattoo goes Viral

Disha Patani : ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ లో ఇప్పటికే 900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. బాలీవుడ్ భామ దిశా పటాని కూడా కల్కి సినిమాలో రాక్సీ అనే పాత్రలో కాసేపు మెరిపించింది. తాజాగా కల్కి సినిమా భారీ విజయం సాధించినందుకు దిశా పటాని స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది.

Also Read : Mahesh Babu : రాజమౌళి సినిమా కోసం నాజర్ దగ్గర ట్యూషన్‌కి వెళ్తున్న మహేష్.. అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేష్..

రాక్సీ గెటప్ లో దిశా పటాని ఫోటోలు షేర్ చేసింది. అలాగే కొన్ని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది. అయితే ఓ ఫొటోలో తన నడుము మీద ఉన్న టాటూని కూడా చూపించింది. ఓ కొత్త రకమైన భాషలో ఈ టాటూ ఉంది. దీంతో ఇది ఏ భాష? ఈ టాటూ అర్ధం ఏంటి అని నెటిజన్లు వెతుకుతున్నారు. అయితే దిశా పటాని నడుము మీద ఉన్న టాటూ హీబ్రూ భాషలో ఉంది అని తెలుస్తుంది. ఇజ్రాయిల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో ఈ భాష మాట్లాడతారు. ఈ భాషలో ఆ టాటూ అర్ధం.. అతను నమ్మే ప్రతిదీ పొందవచ్చు అని తెలుస్తుంది.

దీంతో దిశా పటాని టాటూ వైరల్ అవుతుంది. కల్కి కోసం దిశా పటాని ఈ టెంపరరీ టాటూని వేయించుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని వర్కింగ్ స్టిల్స్, ప్రభాస్ తో సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్ చేసింది. రాక్సీ గెటప్ లో దిశా పటాని అదిరిపోయింది అని సినిమా చూసినప్పట్నుంచి ప్రేక్షకులు అంటున్నారు.