Venkataramaiah Gari Taluka Teaser : ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Venkataramaiah Gari Taluka Teaser)

  • Published on- June 26, 2026 / 07:53 AM IST

Venkataramaiah Gari Taluka Teaser

Venkataramaiah Gari Taluka Teaser : దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మాణంలో సతీష్ ఆవాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా జూలై 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తండ్రి ఎమోషన్, మానవ సంబంధాలు, పొలం ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మీరు కూడా ఈ సినిమా టీజర్ చూసేయండి..

 

Also Read : Anchor Neha Chowdary : చాన్నాళ్లకు మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన యాంకర్ నేహా చౌదరి.. ఫొటోలు..

టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలను గుర్తు చేసే గొప్ప కథ. ఇలాంటి మంచి కథ కావడంతో మా అమ్మాయి దివిజను సినిమా చేయమని ప్రోత్సహించాను. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను బాగా చూపించారు సినిమాలో. డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి యాక్టర్ అవుతుంది అని అన్నారు. నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించే సినిమా ఇది. చాలా కాలంగా చేయాలనుకున్న పాత్ర ఈ సినిమాలో దక్కింది అని అన్నారు.

దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ.. మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని నేనే ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించాను అని తెలిపారు. నిర్మాతలు కోమలి, మహేందర్ తొట్టె మాట్లాడుతూ.. హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మా సినిమా కూడా అంతటి విజయం అందుకోవాలని కోరుకుంటున్నానము. సినిమా చూసాక కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు. జూలై 18న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అన్నారు. హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ.. జయమ్మ పంచాయితీ తర్వాత నేను చేసిన మంచి సినిమా ఇది అని అన్నారు.